Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవ మృగంలా శవాలు పీక్కుతినే రాబందులా మారిన జగన్.. పిచ్చెక్కింది: ఆనం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానంద రెడ్డి ఫైర్ అయ్యారు. జగన్‌కు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తూ పదే పదే ప్రభుత్వ పాలనను విమర్శిస్తున్నారని ఆనం మండిప

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2016 (11:00 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానంద రెడ్డి ఫైర్ అయ్యారు. జగన్‌కు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తూ పదే పదే ప్రభుత్వ పాలనను విమర్శిస్తున్నారని ఆనం మండిపడ్డారు. ఆదివారం ఆనం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ సమాధి అయిపోయే పరిస్థితిలో జగన్ అంతిమ పోరాటం చేస్తున్నారన్నారు.

రాయలసీమ రైతులను ఆదుకునేందుకు సీఎం శ్రమిస్తుంటే చూసి ఓర్వలేని జగన్ ధర్నాలు, బంద్‌లు అంటూ పిలుపునివ్వడం సిగ్గు చేటన్నారు. మానవ మృగంలా శవాలు పీక్కుతినే రాబందులా జగన్ తయారయ్యాడని విమర్శించారు.
 
అవినీతి ఊబిలో చిక్కుకుపోయిన జగన్ నారా లోకేశ్‌ను విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. పద్ధతి మార్చుకుని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు. నదిలో కొట్టుకుపోతున్న నావను నావికుడు ఏ విధంగా రక్షిస్తాడో ఆ తరహాలోనే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రగతి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. రేపటి తరం కోసం ఆయన చేస్తున్న పోరాటానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments