Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతం చేసే మగాడు ఇంకా పుట్టలేదురా బచ్ఛా.. తురేయ్ అనిల్ అంటే తల ఎక్కడ పెట్టుకుంటావ్...

Webdunia
మంగళవారం, 27 జూన్ 2023 (16:20 IST)
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎన్నో దశాబ్దాలుగా క్రియాశీలకంగా ఉండే ఆనం కుటుంబాన్ని అంతమొందిస్తామంటూ మాజీమంత్రి, నెల్లూరు సిటీ వైకాపా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రామణా రెడ్డి తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు. ఆనం కుటుంబాన్ని అంతమొందించే మగాడు ఇంకా పుట్టలేదురా బచ్ఛా అంటూ అన్నారు. పైగా, ఒరేయ్ జగన్.. ఒరేయ్ అనిల్... తురేయ్ అనిల్ అంటే నువ్వు, నీ నాయకుడు తల ఎక్కడ పెట్టుకుంటారు? అని ప్రశ్నించారు. 
 
మంగళవారం నారా లోకేశ్ పాదయాత్ర క్యాంపు సైట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, మా నాయకుడు లోకేశ్ అమెరికాలో చదివాడని గర్వంగా కాలరెగరేసి చెపుతాం.. మీ నాయకుడు ఏం చదివాడో, ఎక్కడ చదివాడో చెప్పగలవా అనిల్ అని ప్రశ్నించారు. స్టాన్ ఫోర్డ్‌లో చదివిన లోకేశ్ పప్పా.. పదో తరగతి తప్పిన జగన్ నిప్పా అంటూ నిలదీశారు. 
 
మీ నాయకుడు గంటలపాటు తడబడకుండా మీడియాతో మాట్లాడగలడా, కాగితాలు చూడకుండా సమాధానం చెప్పగలడా, మీ నాయకుడి చదువు ఇదని ఫలానా చోట చదివాడని చెప్పగలవా అని ప్రశ్నల వర్షం కురిపించారు. సొంత బాబాయ్ సహా, నెల్లూరు జిల్లా వైకాపా నేతలతో ఆఖరికి మంత్రులతో కూడా నీకు ఎందుకు పడటం లేదు అనిల్ అని ఆనం నిలదీశారు. జగన్ టిక్కెట్లు ఇచ్చిన వారిని ఓడించిన అనిల్.. ముఖ్యమంత్రికి వీరాభిమానివా? అని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments