Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభాస్ మా సినిమా గురించి మంచి ట్వీట్ చేశారు : లవ్ యు రామ్ డైరెక్టర్ డివై చౌదరి

Advertiesment
Director DY Chaudhary
, మంగళవారం, 27 జూన్ 2023 (15:26 IST)
Director DY Chaudhary
సక్సెస్ ఫుల్  డైరెక్టర్ కె దశరధ్ నిర్మాతగా వ్యవహరిస్తూ కథ అందించిన చిత్రం ‘లవ్ యు రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు.  రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్, పాటలకు కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 30న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో దర్శక, నిర్మాత డివై చౌదరి విలేకరుల సమావేశంలో ‘లవ్ యు రామ్’ విశేషాలని పంచుకున్నారు.
 
టైటిల్ చూస్తుంటే ఇది ప్రేమకథ అని అర్థమవుతుంది.. ఇది ఏ తరహా ప్రేమ కథ ?
ఇప్పటివరకూ చూసిన ప్రేమ కథలకు ‘లవ్ యు రామ్’ చాలా భిన్నంగా ఉంటుంది. ప్రేమించడమే జీవితం అని నమ్మే ఒక అమ్మాయి, నమ్మించడమే జీవితం అనుకునే అబ్బాయి మధ్య జరిగే అందమైన ప్రేమకథ. ఈ సినిమాలో నిజమైన ప్రేమని చెప్పాం. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఆశించి, కొన్ని అంచనాలతో ప్రేమిస్తారు. ఈ క్రమంలో మంచే మొదట కనిపిస్తుంది. ఐతే ఒకసారి ప్రయాణం మొదలైన తర్వాత తనలోని ఒకొక్క లేయర్ బయటికి వస్తే ..  ప్రేమించిన అమ్మాయి ఎలా ఫీలౌతుంది. అమ్మాయి ఆ ప్రేమని వదులుకుందా? లేదా అతనిలో మార్పుని తెచ్చిందా ? అనేది చాలా అందంగా చూపించాం.
 
దశరధ్ గారితో కలిసి ఈ సినిమా చేయడానికి కారణం ?
నేను ,దశరధ్ చిన్నప్పటి నుంచి స్నేహితులం. ఒకటే ఊరు, స్కూల్. తను సినిమాల్లోకి వచ్చారు. నేను టీవీ సీరియల్స్ చేశాను. గతంలో 16 డేస్ అనే సినిమా కూడా చేశాం. ఈ మధ్య కాలంలో కుటుంబం అంతా కలసి చూసే చిత్రాలు రావడం తగ్గింది. ఒక క్లీన్ ఎంటర్ టైనర్ చేయాలని అనుకున్నాం. అప్పుడు ఈ కథ చెప్పారు. చాలా నచ్చింది. యూత్ , ఫ్యామిలీ ఆడియన్స్, ఎన్ఆర్ఐలకు బాగా రీచ్ అవుతుంది.
నిజానికి ఈ చిత్రానికి దశరధ్ దర్శకత్వం చేయాలి. కానీ తను వేరే పెద్ద ప్రాజెక్ట్ తో బిజీగా ఉండటంతో ''నేను ఉంటాను నువ్వు డైరెక్ట్ చెయ్'అన్నారు. తను కూడా ఈ చిత్రానికి ఒక నిర్మాత. ఇద్దరం మంచి సమన్వయంతో సక్సెస్ ఫుల్ గా ఈ ప్రాజెక్ట్ ని  పూర్తి చేశాం.
 
దశరధ్ గారికి  లవ్, ఫ్యామిలీ  కథలు ఇష్టం.. మీకు ఇష్టమైన జోనర్ ఏంటి ?
నాకు ప్రేమకథలు, ఫ్యామిలీ డ్రామాలు ఇష్టం. ఇద్దరం బాగా ట్యూన్ అయ్యాం. ఇందులో ఖచ్చితంగా దశరధ్ బ్రాండ్ వుంటుంది. ఇందులో చిన్న బిట్స్ గా నాలుగు ఇంగ్లీష్ సాంగ్స్ వస్తాయి. అలాగే ఒక హిందీ పాట కూడా  వుంది. పాటల పరంగా చాలా పెద్ద హిట్ అయ్యింది. వేద, దశరధ్ గారి సొంత తమ్ముడు. ఇంతకిముందు కొన్ని సినిమాలు చేశారు.  ఈ చిత్రానికి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.
 
దశరధ్ గారు వున్నప్పుడు పెద్ద స్టార్స్ ని తీసుకోవచ్చు కదా.. కొత్తవాళ్ళతో చేయడానికి కారణం ?
ఇందులో కథే హీరో. ఈ కథ ప్రేక్షకులు కనెక్ట్ కావాలంటే కొత్తవాళ్ళతో చేయడమే కరెక్ట్ అనిపించింది. యుఎస్ లో ప్రీమియర్ వేశాం. అద్భుతమైన స్పందన వచ్చింది.  హరీష్ శంకర్ గారు సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇంత మంచి సినిమాకి తనవంతు సాయంగా ప్రమోషన్స్ లో భాగమయ్యారు. అందరి దర్శకులతో డైరెక్టర్ డిఎ అనే ఈవెంట్ ని నిర్వహించి ప్రోత్సహించారు.
 
హీరో, హీరోయిన్ ఎంపిక ఎలా జరిగింది ?  
రోహిత్ ‘నాట్యం’ సినిమాలో చేశాడు. తను మంచి డ్యాన్సర్. చాలా యీజ్ వుంది. ఈ పాత్రకు తను చక్కగా సరిపోయాడు. ఇందులో హీరోయిన్ పక్కింటి అమ్మాయిలా వుండాలి. ఈ కథలో ఆమె పాత్ర చాలా కీలకం. ఆ పాత్రలో అపర్ణ ఎక్స్ టార్డినరిగా చేసింది. హీరో. హీరోయిన్ తెరపై చూడటానికి చూడముచ్చటగా వుంటారు. జోడి అద్భుతంగా కుదిరింది.
 
యూరప్ లో కూడా షూటింగ్ చేశారు కదా.. బడ్జెట్ కంట్రోల్ ఎలా చేశారు ?
చిన్న సినిమాగానే చేద్దామని దిగాం. ఐతే  దిగిన తర్వాత కథ డిమాండ్ చేసింది ఇస్తూనే వెళ్ళాలి. ఇందులో వందేళ్ళ జమిందారి ఇల్లు కావాలి.   ఖమ్మంలో ఒక జమిందారి కుటుంబాన్ని చాలా రిక్వెస్ట్ చేసి అక్కడ పది రోజులు షూట్ చేశాం. చాలా సహజంగా వచ్చింది. అలాగే మారేడుమిల్లి పారెస్ట్ లో షూట్ చేశాం. ఆ తర్వాత యూ ఎస్ లో కొన్ని రోజులు షూట్ చేయాలి. వీసా కారణాల వలన అక్కడికి వెళ్ళడం కుదరలేదు. యూరప్ లో తక్కువగా అవుతుందని అనుకుంటే.. నార్వే ప్రపంచంలోనే ఖరీదైన దేశమని అక్కడి వెళ్ళిన తర్వాత తెలిసింది. అక్కడ ప్రతిది చాలా కాస్ట్లీ. ఇప్పటివరకూ తెలుగు ఒకటో రెండో సినిమాలు అక్కడ తీశారు. ప్రేక్షకులకు మంచి విజువల్ ఫీస్ట్ లా వుంటుంది. అద్భుతమైన లొకేషన్స్. సినిమా చాలా బ్యూటిఫుల్ గా వుంటుంది. మైత్రీ వారి ద్వారా సినిమాని విడుదల చేస్తున్నాం. చాలా మంచి పాజిటివ్ రిపోర్ట్ వుంది.
 
ఇండస్ట్రీలోని చాలా మంది దర్శకులకు ఈ సినిమాని చూపించారు కదా.. ఇది ఎలా సాధ్యమైయింది?
ఈ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ గారికి కృతజ్ఞతలు. ఇరవై మంది దర్శకులని ఆయనే తీసుకొచ్చారు. అలాగే ప్రభాస్ గారు మా సినిమా గురించి మంచి ట్వీట్ చేశారు. అలాగే నాగార్జున గారు సాంగ్ లాంచ్ చేశారు. కొరటాల శివ, వివి వినాయక్ ఇలా అందరికీ సినిమా నచ్చి ఇంత మంచి సినిమాని ప్రోత్సహించాలని ముందుకు వచ్చారు. వారందరికీ కృతజ్ఞతలు.
 
మీ కాంబినేషన్ లో వేరే ప్రాజెక్ట్స్ ఉంటాయా ?
మూడు వెబ్ సిరిస్ లు రెడీ అవుతున్నాయి. అలాగే దశరధ్ పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నారు. తర్వలోనే అనౌన్స్ చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాక్షన్ థ్రిల్లర్ గా S-99- మోషన్ టైటిల్ విడుదల చేసిన రమేశ్ ప్రసాద్