Webdunia - Bharat's app for daily news and videos

Install App

దశాబ్దకాలంలో నాలుగో పార్టీ... ఇదీ అవంతి శ్రీనివాస్ జంపింగ్ హిస్టరీ

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (12:23 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆ పార్టీతో పాటు తన లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాలో చేరిపోయారు. వాస్తవానికి అవంతి శ్రీనివాస్ పార్టీ మారబోతున్నారంటూ గత ఆర్నెల్లుగా ప్రచారం సాగుతోంది. అది నేటికి నిజమైంది. 
 
ప్రస్తుతం లోక్‌సభ సభ్యుడుగా ఉన్న అవంతి శ్రీనివాస్.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించి, భీమిలి లేదా విశాఖపట్టణం నార్త్ అసెంబ్లీ స్థానాల్లో ఒకదాన్ని కేటాయించాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కోరారు. దీనికి ఆయన ససేమిరా అన్నట్టు సమాచారం. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు అవంతి దూరంగా ఉంటూ వచ్చారు. అదేసమయంలో ఆయన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలతో టచ్‌లో ఉంటూ వచ్చారు. 
 
ఈ క్రమంలో గురువారం టీడీపీతో పాటు తన ఎంపీ పదవికి రాజీనామా చేసి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్‍‌లోని జగన్ నివాసమైన లోటస్‌పాండ్‌కు వెళ్లి వైకాపా కండువా కప్పుకున్నారు. అయితే, గత పదేళ్ళలో అవంతి శ్రీనివాస్ పార్టీ మారడం ఇది నాలుగోసారి. 
 
విశాఖలో ప్రముఖ విద్యా సంస్థల అధినేతగా పేరుగడించిన అవంతి... గత 2009లో సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అదే యేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. పిమ్మట 2011లో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దీంతో అవంతి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 
 
2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడిన అవంతి.. టీడీపీ గూటికి వచ్చారు. ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇపుడు అంటే 2019లో తిరిగి టీడీపీకి రాజీనామా చేసి వైకాపాలో చేరారు. నిజానికి అవంతి శ్రీనివాస్ ఎంపీ పదవీకాలం మరో రెండుమూడు నెలల్లో ముగియనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూన్ లో చిరంజీవి షూటింగ్ ప్రారంభిస్తామన్న అనిల్ రావిపూడి

మిథున్ చక్రవర్తి లవ్ స్టొరీ బిగిన్స్ చిత్రం మొదలైంది

David Warner: రాబిన్ హుడ్‌ సినిమాలో డేవిడ్ వార్నర్... నితిన్, శ్రీలీల చిత్రాల్లో ఎలా కనిపిస్తారో?

రాణి భార‌తి ఈజ్ బ్యాక్‌! చ‌దువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా.. (video)

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments