Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఉపాధి కోల్పోయిన వారి కోసం అత్యవసర నిధి: పవన్ కల్యాణ్ విజ్ఞప్తి

Webdunia
బుధవారం, 6 మే 2020 (20:10 IST)
లాక్‌డౌన్ కారణంగా వివిధ రంగాలపై ఆధారపడి పని చేసేవారు తమ ఉపాధి కోల్పోవడంతో అవస్థలు పడుతున్నారని, వారిని ఆదుకోవడానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపశమన చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు బుధ‌వారం ఒక ప్రకటన విడుదల చేశారు. రోజు కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, కుల వృత్తి చేసుకునే క్షురకులు, రజకులు, వడ్రంగి, చేనేత కార్మికులు, ఆటో, టాక్సీ డ్రైవర్లు, స్వయం ఉపాధి కింద పని చేసుకునే బైక్ మెకానిక్ లు, ఎలక్ట్రిక్ పనులు  చేసుకునేవారు, హాకర్లు, చిన్నపాటి టిఫిన్ బండ్లు నిర్వహించుకునే వారు ఆర్థికంగా దెబ్బతిన్నారని అన్నారు.

వీళ్లందరికి రూ.5 వేలకు తక్కువ కాకుండా ఆర్థికసాయం అందజేయాలని కోరారు. ఇటువంటి వారిని ఆదుకునేందుకు కర్ణాటక ప్రభుత్వంరూ.1610 కోట్లతో ఒక అత్యవసర నిధి  ఏర్పాటు చేసిందని తెలిపింది. ఏపీలో కూడా ఇటువంటి నిధి ఒకటి ఏర్పాటు చేసి ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి  విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా, చిరు వ్యాపారులు, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు నిర్వహిస్తున్న వారికి విద్యుత్ బిల్లుల విషయం కొన్ని నెలల పాటు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. ఆస్తి, వృత్తి పన్నుల వసూలు మినహాయింపు ఇవ్వాలని ఆ ప్రకటనలో పవన్ కల్యాణ్ కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments