Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ క్షణమైనా లగడపాటి అరెస్ట్.. ఎందుకంటే..?

Webdunia
మంగళవారం, 28 మే 2019 (17:49 IST)
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై పోలీస్ కేసు నమోదైంది. ఏపీ ఎన్నికలపై లగడపాటి సర్వేపై కొవ్వూరుకు చెందిన అడ్వకేట్ మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. లగడపాటి కారణంగా చాలామంది నష్టపోయారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని సర్వే చేసి చెప్పిన లగడపాటి వలన అనేకమంది బెట్టింగులు కట్టి నష్టపోయారన్నారు. 
 
ఈ తప్పుడు సర్వేల వెనుక ఎవరు ఉన్నారో విచారణ జరిపి తేల్చాలని పోలీసులను కోరారు. కాగా, ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. లగడపాటి వెనుక అంతర్జాతీయ బెట్టింగ్ మాఫియా అండదండలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు అడ్వకేట్ మురళీ కృష్ణ.
 
ఏపీ ఎన్నికల ఫలితాలకు ముందు లగడపాటి ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలను ప్రకటించారు. టీడీపీయే అధికారం చేపడుతుందంటూ... ఆయన జోస్యం చెప్పారు. అయితే ఫలితాల్లో టీడీపీ అడ్రేస్ లేకుండా పోయింది. లగడపాటి సర్వే శుద్ధ తప్పని తేలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చింది. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా కొట్టిన లగడపాటి... ఏపీ ఎన్నికల్లో కూడా మరోసారి బోర్లా పడ్డారు. 
 
దీంతో ఇప్పుడు ఆయన చిక్కుల్లో పడ్డారు. లగడపాటిని నమ్మి కోట్ల రూపాయలు బెట్టింగులు కట్టినవారంతో తీవ్రంగా నష్టపోయారంటూ లాయర్ మురళీ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు సర్వేలతో జనాన్ని మోసం చేస్తున్న లగడపాటిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments