నిరీక్షణ ముగిసింది.. న్యాయం జరిగింది : ప్రణయ్ భార్య అమృత

ఠాగూర్
మంగళవారం, 11 మార్చి 2025 (19:59 IST)
తన భర్త హత్య కేసులో తన నిరీక్షణ ముగిసిందని, దీంతో తనకు న్యాయం జరిగిందని ప్రణయ్ భార్య అమృత అన్నారు. గత 2018లో ప్రణయ్ అనే దళిత యువకుడు ఉన్నత కులానికి చెందిన అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని అమృత తండ్రి మారుతిరావు బీహార్‌కు చెందిన కిరాయి ముఠాకు సుపారీ ఇచ్చి ప్రణయ్‌ను హత్య చేయించాడు. ఆ తర్వాత ఆయన కొంతకాలానికి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఈ కేసులో ఏ2గా ఉన్న బీహార్‌కు చెందిన కిరాయి హంతకుడు సుభాష్ శర్మకు నల్గొండ ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టు ఉరిశిక్షను ఖరారు చేయగా, మిగిలిన నిందితులకు యావజ్జీవ కారాగారశిక్షను విధిస్తూ సోమవారం తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై ప్రణయ్ భార్య అమృత స్పందించారు. 
 
తన భర్త ప్రణయ్ హత్య కేసులో న్యాయం జరిగిందని పేర్కొన్నారు. పరువు పేరిట చేసే దురాగతాలు ఈ తీర్పుతో అయినా తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. తన నిరీక్షణ ముగిసింది. న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తన హృదయం భావోద్వేగంతో నిండిపోయిందన్నారు. తనకు అండగా నిలిచిన పోలీసు శాఖ, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీడియా సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. 
 
తన బిడ్డ పెద్దవాడవుతున్నాడని, తన మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అలాగే, అతని భవిష్యత్‌ను కాపాడుకోవడానికి తాను మీడియా ముందు కనిపించడం లేదని అన్నారు. తాను ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించలేనని పేర్కొన్నారు. అందువల్ల శ్రేయోభిలాషులందరూ తమ గోప్యతను అర్థం చేసుకుని గౌరవించాలని అభ్యర్థిస్తున్నట్టు ఆమె రాసుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments