Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియ‌ల్ ఎస్టేట్ కోసం అమ‌రావ‌తిని చంపేశారు

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (14:03 IST)
అమరావతిని చంపేశారు... ఇపుడు రాజ‌కీయాల్లోకి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ‌చ్చారంటూ తెలుగుదేశం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దేవినేని ఉమ వైసీపీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. కృష్ణా జిల్లా తిరువూరులో ఆయ‌న మీడియా సమావేశంలో మాట్లాడారు. ప‌క్క రాష్ట్రంలో శ్రీశైలం దగ్గర విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంటే, నోరు తెరవలేని పరిస్థితిలో సీఎం జ‌గ‌న్ ఉన్నార‌ని విమ‌ర్శించారు.

ద‌గ్గ‌రుండి 2 టీఎంసీల నీళ్లు సముద్రంలో కి పంపించార‌ని, రాయలసీమ ప్రాంతాల్లో ఒక టీఎంసీ నీరివ్వ‌మని బ్రతిమిలాడుతుంటే, నీరు వృధా చేస్తున్నార‌ని ఆరోపించారు. కర్నూలు జల దీక్షలో ఏమన్నావు.. అప్పుడు గుర్తుకు రాలేదా తెలుగువారు? 2,500 కోట్ల రూపాయ‌ల‌కు కక్కుర్తి పడి రావాల్సిన బకాయిలు అన్ని గాలికొదిలేశారు. పోలవరం ఒక మీటర్ తగ్గించమంటే.. ఈయన 5 మీటర్లు తగ్గించి లాలూచీ పడ్డార‌ని సీఎంని విమ‌ర్శించారు.
 
అమరావతి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే రాజీనామా చేస్తానన్ని చెప్పాడు.. ఇప్పుడు నేను ఎప్పుడన్నాను అని మాట్లాడుతున్నాడు... ఇపుడు తిరువూరులో ఎకరం 10 లక్షల రూపాయ‌ల‌కు రేటు తగ్గిపోయింది. ఒక్కసారి... ఒక్కసారి అని... ఈవీఎం పుణ్యమా అని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసావు... నువ్వు అమరావతికి వెళ్లాలంటే వేయి మంది పోలీసులు కాపలా ! అసెంబ్లీ కి వెళ్లాలంటే వేయి మంది పోలీసులు కాపలా! అని జ‌గ‌న్‌ను ఎద్దేవా చేశారు. 
 
పోలవరం పనులు ఎందుకు ఆపేశారు?
ఆ రోజుల్లో  పోల‌వ‌రం డ్యామ్ సైట్లో పేదవాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చి డ్యామ్ సైట్ లో పనులు ప్రారంభించాం. ఇవాళ ఈ సన్నాసుల‌ నిర్వాకం వల్ల డ్యామ్ కు ముంపు వచ్చింద‌ని, గిరిజనుల‌కు ఇళ్ళు క‌ట్టించ‌కుండా గాలికొదిలేశార‌ని దేవినేని విమ‌ర్శించారు.

ఇవాళ ఉప ముఖ్యమంత్రులను అడుగుతున్నా.. ఆ గిరిజనుల దగ్గర వెళ్ళండ‌ని స‌వాలు చేశారు. ఆ రోజు చంద్రబాబు గారు 7 ముంపు మండలాల మాకు ఇస్తేనే, నేను ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పి, 7 ముంపు మండలాలను కలిపి పోలవరం కల సాకారం చేసాడ‌న్నారు. చంద్రబాబు అసెంబ్లీలో చెబితే, తొందరపాటు వద్దు , పెద్ద వాళ్ళ తో కూర్చొని నిర్ణయం తీసుకోమంటే జ‌గ‌న్ ఎగతాళి చేసాడు.
 
గత 6 ఏళ్ళు లేని వివాదం ఇవాళ ఎందుకు వచ్చింద‌ని ప్ర‌శ్నించారు. ప్రగతి భవనంలో బిర్యానీ తిన్నప్పుడు లేని వివాదం ఇవాళ ఎందుకు వచ్చింద‌న్నారు. పక్క రాష్ట్రం మంత్రులు మీ నాయకుడిని తిడుతుంటే, మంత్రులు త‌మ నోటి లో ఏమి పెట్టుకున్నారు? జీడీ పెట్టుకున్నారా? అని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments