Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీనారాయణ చూపిన కారణం సహేతుకంగా లేదు...

Webdunia
శుక్రవారం, 31 జనవరి 2020 (12:44 IST)
జనసేన పార్టీ నుంచి వైదొలిగేందుకు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ చూపిన కారణంగా సహేతకంగా లేదని సినీ నిర్మాత, తెదేపా నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త అంబికాకృష్ణతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. 
 
ప్రజాసేవ కోసం సినిమాలు వదిలేస్తున్నానని చెప్పిన పవన్‌ ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తుండడాన్ని నిరసిస్తూ లక్ష్మీనారాయణ పార్టీకి నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీన్ని తప్పుబడుతూ పవన్ కళ్యాణ్ నిలకడలేని నిర్ణయం వల్లే తాను జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లక్ష్మీనారాయణ ప్రకటించారు. 
 
దీనిపై అంబికాకృష్ణ స్పందిస్తూ, జనసేన పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడానికి వి.వి.లక్ష్మీనారాయణ ఎత్తిచూపిన కారణం సహేతుకంగా లేదన్నారు. వృత్తిని కొనసాగిస్తే అందులో తప్పుపట్టడానికి ఏముంటుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను వెనకేసుకు వచ్చారు. 
 
వృత్తిని వదిలేసి రాజకీయాలు చేయాలని ఎవరూ చెప్పలేదన్నారు. లక్ష్మీనారాయణ బయటకు వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవడం తప్పుకాదని, కానీ వెళ్లిపోతూ చేసిన ఆరోపణ సరికాదని హితవు పలికారు. పవన్‌ కల్యాణ్‌ సినిమాలలో నటిస్తూ రాజకీయాల్లో కొనసాగాలని కోరుతున్నానన్నారు.
 
అలాగే, ఐవైఆర్ కృష్ణారావు కూడా స్పందించారు. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, బీజేపీ కలిసి ఒక కూటమిగా తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్న ఈ తరుణంలో జనసేన నుంచి వీరి రాజీనామా సరైన నిర్ణయం కాదేమోనని నా అభిప్రాయం. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా తృతీయ కూటమి బలపడటానికి ప్రయత్నించి ఉంటే బాగుండేది' అని ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments