Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబటి రాంబాబుకు పక్కలో బల్లెంగా మారిన అల్లుడు.. ఎలా

ఠాగూర్
బుధవారం, 8 మే 2024 (10:06 IST)
వైకాపా నేత, ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు ఆయన అల్లుడు కంట్లో నలుసుగా మారాడు. అసలే ఎన్నికల్లో గెలుస్తామో లేదో అన్న భయంతో నిద్రలేని రాత్రులను గడుపుతున్న అంబటి రాంబాబు... ఇపుడు అల్లుడు డాక్టర్ గౌతమ్ విడుదల చేస్తున్న రోజుకో వీడియో మంత్రి అంబటికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా మరో వీడియోను డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేశారు. 
 
'నా బిడ్డల్ని నాలుగేళ్లుగా నాకు దూరం చేసి, నా ప్రాణాన్ని తీసేసినంత పనిచేసి.. ఎలాంటి తప్పూ చేయలేదని బుకాయిస్తున్నారా? ఇదేనా న్యాయం' అంటూ మంత్రి అంబటి రాంబాబును ఆయన రెండో అల్లుడు డాక్టర్‌ గౌతమ్‌ సూటిగా ప్రశ్నించారు. ఇటీవల అంబటి రాంబాబును విమర్శిస్తూ గౌతమ్‌ వీడియో చేయగా అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన విషయం తెల్సిందే. దానిపై అంబటి విలేకర్ల సమావేశం పెట్టి పలు ఆరోపణలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో గౌతమ్‌ మంగళవారం మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అందులో మాట్లాడుతూ.. 'నా వీడియోపై అంబటి రాంబాబు స్పందిస్తూ నాలుగేళ్లుగా తన మనవడు, మనవరాలిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నానని, అల్లుడైన నేను ఆర్థిక సాయం చేయట్లేదని అన్నారు. నా కుమారుడు, కుమార్తెను మీరు పోషించక్కర్లేదు. రేపు మీడియా సాక్షిగా వారిద్దర్నీ మీ ఇంటికి వచ్చి తీసుకెళ్తా లేదా నా ఇంటి వద్ద దించి వెళ్లండి. మీరు వారి కోసం ఒక్క రూపాయీ పెట్టక్కర్లేదు' అని పేర్కొన్నారు. 
 
'2023 మార్చి 3న నా తండ్రి ఐసీయూలో బెడ్‌పై ఉండి తన మనవడు, మనవరాలిని చూడాలని ఉందని అంబటి రాంబాబును కోరారు. మాట్లాడలేని స్థితిలో ఉండి చివరి కోరికగా పిల్లల్ని చూడాలని ఉందని ఎంతగానో ప్రాధేయపడ్డారు. దీనిపై ఎన్ని సందేశాల్ని పంపినా రాంబాబు స్పందించలేదు. నా తండ్రి అదే నెల 22న చనిపోతే కనీసం చివరిసారి చూడటానికైనా పిల్లల్ని పంపించ లేదు. ఇదేనా మీ మంచితనం. మీ కుటుంబాన్ని ప్రశ్నిస్తే ఎంత దుర్మార్గమైనా చేసేస్తారా? ఒక తండ్రి ఆఖరి కోరిక తీర్చలేని కుమారుడిగా నన్ను చేస్తారా? అసలు మీరు మనిషేనా. మీతో విసుగెత్తి చివరికి కోర్టుకు వెళ్తే దానికీ వేరే అర్థాలు చెబుతారా?' అని గౌతమ్‌ ఆవేదన చెందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments