Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్యను కాల్ గర్ల్‌గా మార్చేశాడు..

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (12:20 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ప్రేమ, వివాహం వంటి పవిత్ర బంధాలకు కాలం చెల్లిపోతుంది. భార్యాభర్తల సంబంధాలు సైతం ఆధునిక యుగంలో నకిలీగా మారిపోతున్నాయి. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. ప్రేమించిన పెళ్లాడిన భార్యనే ఈ దుండగుడైన భర్త కాల్ గర్ల్ చేశాడు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రేమిస్తున్నానని వెంటపడి.. నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. 
 
బెంగళూరులో వీరి వివాహం జరిగింది. ఆపై ఆ ప్రేమికులు అంబర్ పేటలో కాపురం పెట్టారు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ యువకుడి ఉద్యోగం లేదు. దీంతో కట్టుకున్న భార్యను మందేసి హింసించేవాడు. తన బంధువులు, స్నేహితుల భార్యల ఫొటోలను, తన భార్య ఫొటోలను కాల్ గర్ల్స్ గా పరిచయం చేస్తూ, పోస్టులు పెట్టేవాడు. ఎవరైనా విటులు స్పందిస్తే, వారి నుంచి తన బ్యాంకు ఖాతాలో డబ్బులు వేయించుకునేవాడు. 
 
ఆపై వారిని తన స్నేహితులంటూ ఇంటికి తీసుకుని వచ్చి, వారికి మద్యం తాగించి, భార్యతోనూ మద్యం తాగించి, తాను బయటకు వెళ్లిపోయేవాడు. ఆపై ఆమె నరకాన్ని అనుభవించేది. ఇలా దాదాపు ఏడాది గడిచిన తరువాత, కొందరు విటులు అతనితో గొడవకు దిగడం మొదలు పెట్టడంతో, ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఈ వ్యవహారం బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments