Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవిందా..గోవిందా, అద్భుతం.. శేషాచలం కొండల్లో...

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (19:27 IST)
తిరుమల వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న ప్రాంతమంటేనే ఒక ప్రత్యేకత. ఏడుకొండపై ఉన్న స్వామివారిని దర్సించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వచ్చి వెళుతుంటారు. అలాంటి ప్రాంతం ఇప్పుడు మరింత అందంగా.. అద్భుతంగా దర్సనమిస్తోంది.
 
గత వారంరోజుల నుంచి తిరుపతిలో వర్షం పడుతోంది. కాసేపు వర్షం పడినా శేషాచలం కొండలు మాత్రం పచ్చగా కనిపిస్తున్నాయి. ఎండాకాలంలో అటవీ ప్రాంతంలోనే చెట్లన్నీ ఎండిపోయి కళావిహీనంగా మారిపోతే ప్రస్తుతం వర్షం కారణంగా ఎంతో అందంగా శేషాచలం కొండలు కనిపిస్తున్నాయి.
 
దాంతో పాటు తిరుమలలో పడిన వర్షానికి కొండల మధ్య నుంచి నీరు జాలువారి తిరుపతిలోని కపిలతీర్థంలోకి వస్తోంది. మాల్వాడి గుండం నుంచి కపిలేశ్వర ఆలయంలోకి వస్తున్న నీటిని భక్తులు, స్థానికులు ఆహ్లాదకరంగా తిలకిస్తున్నారు. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్లలో మంచు దుప్పట్లు కనిపిస్తున్నాయి. 
 
మంచు కొండలను దట్టంగా కప్పడంతో పాటు చిరుజల్లులు పడుతుండడంతో ఘాట్ రోడ్లలో వెళ్ళే భక్తులు కొత్త లోకంలో విహరిస్తున్నారు. ఎంతో అద్భుతమైన దృశ్యాలు శేషాచలం కొండల్లో కనిపిస్తుండడంతో భక్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పరిమిత సంఖ్యలో భక్తులు వస్తున్నా తిరుపతిలోని వాతావరణానికి మంత్రముగ్థులు అవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments