Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లోని 9 జిల్లాలకు భారీ వర్ష సూచన.. హెచ్చరిక

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (17:33 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత అనేక జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో శుక్రవారం రాష్ట్రంలోని 9 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి ఒక మ్యాచ్‌ను కూడా రిలీజ్ చేసింది. 
 
తొమ్మిది జిల్లాల్లో భారీ వర్షం, ఐదారు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షం పడుతుందని పేర్కొంది. వీటిలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షం, నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. 
 
అదేవిధంగా కడప, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపర్లి, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఏపీ స్టేట్ మేనేజ్మెంట్ అథారిటీ గురువారం ట్విట్టర్‌లో ఓట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

బెంగుళూరు రేవ్ పార్టీలో తన పేరు రావటం పై జానీమాస్టర్ వివరణ..

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments