Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రైతులకు అండ.. RRR సాయం

Webdunia
సోమవారం, 5 జులై 2021 (21:14 IST)
RRR
వైసీపీ అధినేత, సీఎం జగన్‌తో విభేదించడం ఓ ఎత్తయితే నిత్యం ఆయన్ను టార్గెట్ చేస్తూ లేఖలు కూడా సంధిస్తున్న వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఓ కీలక వ్యక్తిగా మారిపోయారు. 
 
గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, తనపై దాడుల్ని దీటుగా ఎదుర్కొంటున్న రఘురామ ఏకంగా సీఎం జగన్ తోనే సై అంటే సై అంటున్నారు. దీంతో ఏపీలో విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు కంటే ఆయనకే ఎక్కువగా మైలేజ్ పెరుగుతోంది. 
 
ఇప్పటివరకూ మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాష్ట్రంలోనే పోరాటం సాగిస్తున్న అమరావతి జేఏసీ.. ఇప్పుడు పూర్తి స్థాయిలో పార్లమెంటుతో పాటు జాతీయ స్థాయికి తమ పోరును తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది.
 
ఇందుకోసం అమరావతి జేఏసీ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సాయం కోరింది. ఈ మేరకు అమరావతి రైతులు, జేఏసీ నేతలు రఘురామకు లేఖలు రాశారు. అమరావతి వ్యవహారాన్ని జాతీయ స్ధాయికి తీసుకెళ్లేందుకు, పార్లమెంటులో ప్రస్తావించేందుకు సహకరించాలని రఘురామను వారు కోరారు.
 
అమరావతి నుంచి రాజధాని తరలిపోకుండా ఇప్పటికే కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్న జేఏసీ నేతలు, రైతుల విజ్ఞప్తికి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు అంగీకరించారు. పార్లమెంటులో అమరావతి అంశం ప్రస్తావించారంటూ రైతులు చేసిన విజ్ఞప్తిని అంగీకరించిన రఘురామ... అమరావతి ప్రజలకు మద్దతిస్తానని ప్రకటించారు. దీంతో ఇక పార్లమెంటు వేదికగా అమరావతి పోరును తీసుకెళ్లేందుకు రఘురామ రూపంలో రైతులకు ఓ అండ దొరికినట్లయింది. 
 
గత టీడీపీ ప్రభుత్వంలో రాజధానిగా ఎంపిక చేసిన అమరావతి నిర్మాణం పూర్తి కాకుండానే చంద్రబాబు అధికారం కోల్పోయారు. ఆ తర్వాత కూడా రాజధానిలో పలుమార్లు పర్యటించారు. అయినా రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించడం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదనే ప్రచారం జరుగుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments