Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెరవేరిన కోరిక .. తిరుమలకు అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్ర ప్రారంభం!

వరుణ్
సోమవారం, 24 జూన్ 2024 (11:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కలయికతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో అమరావతి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడంతో రాజధాని ప్రాంత రైతులు తిరుమలకు కృతజ్ఞత పాదయాత్రను మొదలుపెట్టారు. రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తిరుమలకు మహిళలు, రైతులు పాదయాత్ర చేపట్టారు. అమరావతి పనులు ప్రారంభమైతే తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్రగా వస్తామని ఉద్యమ సమయంలో రైతులు మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మొదలుపెట్టిన పాదయాత్రను తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ యాత్ర 20 రోజుల పాటు ఇది కొనసాగనుంది. తిరుమల క్షేత్రానికి చేరుకుని తమ మొక్కులు తీర్చుకున్న తర్వాత అమరావతి రైతులు తిరిగి తమతమ ప్రాంతాలకు చేరుకుంటారు.
 
అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పిన టాలీవుడ్ మన్మథుడు!! 
 
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున తన అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఎయిర్‌పోర్టు వద్ద చోటు చేసుకున్న విషయం తన దృష్టికి వచ్చిందని, ఈ విషయంలో అభిమానులకు సారీ చెబుతున్నట్టు చెప్పారు. ఇటీవల ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళుతున్న నాగార్జునను కలిసేందుకు ఓ అభిమాని యత్నించాడు. అ సమయంలో పక్కనే ఉన్న బౌన్సర్లు అతిగా ప్రవర్తించడమే కాకుండా  ఆ అభిమానిపై చేయి చేసుకుని పక్కకు ఈడ్చిపడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది నాగార్జున దృష్టికి కూడా చేరడంతో ఆయన స్పందించారు. 
 
ఎయిర్‌పోర్టు వద్ద జరిగిన విషయం తన దృష్టికి వచ్చిందని, ఇలా జరిగి ఉండకూడదని విచారం వ్యక్తం చేసారు. ఆ వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నాను. భవిష్యత్తులో ఇలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని చెబుతున్నాను అని నాగార్జున వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌వేదికగా ట్వీట్ చేశారు. 
 
కూటమి విజయంతో పవన్ ఫ్యాన్స్ అంతా అదో రకమైన ఆనందంలో ఉన్నాం : నిర్మాత టీజీ విశ్వప్రసాద్ 
 
పీపుల్స్ మీడియా సంస్థ అధినేత, ప్రముఖ సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించడం, అందులోనూ కూటమి విజయానికి పవన్ కళ్యాణ్ కీలక భూమిగా వ్యవహరించడంతో పవన్ కళ్యాణ్ అభిమానులంతా అదో రకమైన ఆనందంలో ఉన్నట్టు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. 
 
ఇటీవల జరిగిన ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే పివి.పార్థసారధితో పాటు చిత్రసీమకు చెందిన పలువురు సినీతారలు పాల్గొన్నారు. వారంతా తెలుగుదేశం, జనసేన, భాజపా కలిసి సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు మళ్లీ మంచి రోజులొచ్చాయని కొనియాడారు.
 
ఇందులో నిర్మాత విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ.. 'నేను చిన్నప్పటి నుంచి చిరంజీవికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన్ని దూరం నుంచి చూస్తే చాలనుకున్నా. అలాంటిది ఆయన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌తో కలిసి పని చేసే అవకాశం దొరికింది. పవన్‌ అభిమానులందరూ ఒకరకమైన ఆనందంలో ఉన్నారు' అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ, అసెంబ్లీలో అడుగు పెట్టి మాట్లాడుతున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయి అని వ్యాఖ్యానించారు. ఇందులో శ్రీవాస్, చందూ మొండేటి, శ్రీరామ్‌ ఆదిత్య, ఆర్పీ పట్నాయక్, రామజోగయ్య శాస్త్రి, బన్నీ వాసు, కృతి ప్రసాద్, హైపర్‌ ఆది, ఎస్‌కెఎన్, కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్, టి.ప్రసన్న కుమార్, బాలాదిత్య, సప్తగిరి, మంగ్లీ పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments