Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూన్ 9న జగన్ సీఎంగా ప్రమాణం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు పోస్టర్లు అంటిస్తా

Advertiesment
Kiran royal

ఐవీఆర్

, గురువారం, 30 మే 2024 (16:02 IST)
జూన్ 9వ తేదీన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్టణంలో ప్రమాణం చేస్తే తిరుపతి నుంచి విశాఖపట్టణం వరకూ నేనే జగన్ పోస్టర్లు అంటిస్తా అంటూ తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ అన్నారు. తను విసిరిన సవాల్‌కు వైసిపి అంగీకరిస్తుందా అని అడిగారు.
 
సోషల్ మీడియాలో జగన్ ప్రమాణ స్వీకారానికి వైజాగ్ హోటళ్లన్నీ బుక్ అయిపోయాయనీ, ఖాళీలు లేవంటూ కామెంట్లు పెడుతున్నారు. మీకు వైజాగ్ నగరంలో ఎన్ని హోటళ్లు కావాలో చెప్పండి నేను చూసి పెడతా అంటూ సెటైర్లు వేసారు.
 
అన్నా... వైసిపి సోషల్ మీడియాలో పనిచేసేవారికి జీతాలు రాలేదన్నా, ప్లీజ్: శ్రీరెడ్డి
ఆమధ్య ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలను చెప్పలేని భాషలో తిట్టిపోసిన నటి శ్రీరెడ్డి మరోసారి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఐతే ఈసారి తిట్టడం కాదు కానీ వైసిపి తరపున కష్టపడినవారి కోసం అభ్యర్థనలు చేస్తూ కనబడింది.
 
శ్రీరెడ్డి రిలీజ్ చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ... వైసిపి సోషల్ మీడియాలో పనేచేస్తున్నవారికి జీతాలు రావడంలేదన్నా. అందరూ తమకు జీతాలు రావడం లేదక్కా అంటూ చెప్పారు. యూ ట్యూబులో పార్టీ కోసం కష్టపడుతున్న ఇన్ఫ్లుయెర్స్ వారికి కూడా జీతాలు రావడంలేదు. ఆడపిల్లల బ్రతుకులు రోడ్లపైకి వచ్చాయన్న. ఇలా వారి జీవితాలు రోడ్లపైకి వచ్చాక కూడా మీరు రెస్పాండ్ అవ్వకపోతే మేం బ్రతికి కూడా వేస్ట్ అన్న. ప్లీజ్ రెస్పాండ్ అంటూ వీడియోలో విజ్ఞప్తి చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తితిదే ఈవో ధర్మారెడ్డి జైలుకెళ్లడం ఖాయం : టీడీపీ నేత ఆనం