Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన అమరావతి రైతుల పాదయాత్ర, కానీ?

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (19:31 IST)
44 రోజుల పాటు వంద కిలోమీటర్లు నడిచి వచ్చిన అమరావతి రైతుల పాదయాత్ర ముగిసింది. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద రైతులు పాదయాత్రను ముగించారు. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ నగరంలో ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది.

 
మొత్తం 13 కిలోమీటర్ల పాటు పాదయాత్ర కొనసాగింది. తిరుపతిలోని రామానాయుడు కళ్యాణమండపం నుంచి ప్రారంభమైన పాదయాత్ర నగరంలో 13 కిలోమీటర్ల పాటు కొనసాగింది. అలిపిరి చేరుకున్న వెంటనే రైతులందరూ ఆనందం వ్యక్తం చేశారు. జై అమరావతి నినాదాలను కాసేపు పక్కన బెట్టేశారు.

 
గోవిందా..గోవిందా అంటూ గోవిందనామస్మరణలతో అలిపిరి పాదాల వద్దకు వెళ్ళారు. తిరుమల శ్రీవారిని ప్రార్థించారు. టెంకాయలు కొట్టారు. స్వామి రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ శ్రీవారిని ప్రార్థించారు.

 
గత వారం రోజుల పాటు దర్సనంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వని టిటిడి అధికారులు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్వామివారి దర్సనానికి సంబంధించి టోకెన్లను మంజూరు చేశారు. మొత్తం 500 మంది అమరావతి రైతులకు 300 రూపాయల సుపథం టోకెన్లను మంజూరు చేశారు.

 
రేపు ఉదయం 10 గంటలకు అలిపిరి పాదాల మండపం మీదుగా నడుచుకుంటూ తిరుమలకు వెళ్లనున్నారు అమరావతి రైతులు. మొత్తం 500 మంది తిరుమలకు వెళ్ళనున్నారు. ఒకేరోజు శ్రీవారిని ప్రార్థించనున్నారు. దీంతో న్యాయస్ధానం టు దేవస్థానం పాదయాత్ర ముగియనుంది.

సంబంధిత వార్తలు

ఇకపై అలాంటి సినిమాలు చేయను.. రామ్ గోపాల్ వర్మ

ప్రతిభావంతులను ప్రోత్సహించటమే యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యం : రామ్ గోపాల్ వర్మ

కన్నప్ప’ని ఆ పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే తీశాం : డా.మోహన్ బాబు

హను రాఘవపూడి లాంచ్ చేసిన అలనాటి రామచంద్రుడు నుంచి నాన్న సాంగ్

బాల్యం నుంచి బాధ్యతకు ఎదిగిన కమిటీ కుర్రోళ్ళు’ టీజర్ ఆవిషరించిన నితిన్

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

నోరూరించే చాక్లెట్స్, తింటే 5 రకాల ఆరోగ్య సమస్యలు, ఏంటవి?

మొలకెత్తిన గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments