Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ పోయాక మ్యారేజ్ చేసుకోవాలనే విషయాన్నే మైండ్ లోంచి తీసేశా: భూమా కుమార్తె

ఫ్యాక్షనిస్టుల కుటుంబాల్లో మమతలు, అనురాగాలు ఉండవా.. బయట ఎన్ని ఆధిపత్య రాజకీయాలు నడిపినా ఇంటిలోపల సాధారణ కుటుంబాలకు మల్లే వారిలో అనుబంధాలు పెనువేసుకుని ఉంటాయని తండ్రి జ్ఞాపకాల సాక్షిగా వివరిస్తోంది మౌనిక. ఇటీవలే గుండెపోటుతో మరణించిన సీమ నేత భూమా నాగిర

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (07:25 IST)
ఫ్యాక్షనిస్టుల కుటుంబాల్లో మమతలు, అనురాగాలు ఉండవా.. బయట ఎన్ని ఆధిపత్య రాజకీయాలు నడిపినా ఇంటిలోపల సాధారణ కుటుంబాలకు మల్లే వారిలో అనుబంధాలు పెనువేసుకుని ఉంటాయని తండ్రి జ్ఞాపకాల సాక్షిగా వివరిస్తోంది మౌనిక. ఇటీవలే గుండెపోటుతో మరణించిన సీమ నేత భూమా నాగిరెడ్డి కుమార్తె ఈమె. రోడ్డు ప్రమాదంలో అమ్మ శోభా నాగిరెడ్డి మృతి చెందిన తర్వాత తన మైండ్ లో నుంచి మ్యారేజ్ చేసుకోవాలనే విషయాన్నే తీసేశాను అంటున్న ఈమె తన తండ్రి గురించి పంచుకున్న జ్ఞాపకాలు ఆమె మాటల్లోనే..
 
“నాన్న ఎప్పటికీ నా హీరోనే. ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా… నాన్న ఫోన్ చేస్తున్నారంటే అటెన్షన్ కు వచ్చేసే దానిని. ఆ భయం .. గౌరవం ఎప్పటికీ ఉంటాయి, నా తండ్రి నుంచి నేను చాలా నేర్చుకున్నానని” చెప్పింది. “నాకు బాగా గుర్తు… చిన్నప్పుడు లారెన్స్ స్కూల్లో నన్ను వదిలిపెట్టడానికి నాన్న వచ్చినప్పుడు, నేను చాలా ఏడ్చాను. నాన్న షర్టు పట్టుకుని పీకితే బటన్స్ అన్నీ ఊడిపోయాయి… 
 
ఫ్యాక్షన్ పరిస్థితులు కారణంగా నాన్న ప్రయాణిస్తున్న జీపులో ఎక్కాలన్నా భయపడే వాళ్లం. ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే… ఒకే రూటులో వెళ్లే వాళ్లం కాదు… ఓన్లీ నైట్ జర్నీస్ చేసే వాళ్లం… ఒకే డ్రైవర్ ఉండేవాడు కాదు… మారుస్తూ ఉండే వాళ్లం… నాకు చదువులో స్టేట్ ర్యాంక్స్ రాకపోయినా ఫర్వాలేదు… పాసయితే చాలు నేను హ్యాపీగా ఉంటానని నాన్న అనేవారు… ఉన్నన్ని రోజులు మమ్మల్ని సంతోష పరచాలని చూశారని” చెప్పుకొచ్చింది. 
 
రోడ్డు ప్రమాదంలో అమ్మ మృతి చెందిన తర్వాత నా మైండ్ లో నుంచి మ్యారేజ్ చేసుకోవాలనే విషయాన్నే తీసేశాను. అయితే నాన్న నాకు సర్ది చెప్పడంతో పెళ్లి చేసుకున్నాను. ఆ రోజు నాన్న చెప్పిన మాటలు నా మైండ్ లో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. అమ్మ పోయిన తర్వాత నాన్న ఉండలేకపోయారని నా ఫీలింగ్. అమ్మ వీడియోస్ చూపించమని పదే పదే మమ్మల్ని అడిగేవారు. అయితే ఆ వీడియోస్ చూసి నాన్న మరింత కుంగిపోతాడనే భయంతో మేము ఆ వీడియోలను పెట్టే వాళ్లం కాదు. ఆ వీడియోలు పెట్టకపోయినా, నాన్న మనసులో అమ్మ గురించిన ఆలోచనలే ఉంటాయని తెలుసు. 
 
అమ్మ, నేను సరదాగా కొట్టుకునే వాళ్లం. అప్పుడు, నాన్న మరింత నన్ను ఎంకరేజ్ చేసేవారు. మా తమ్ముడు కూడా మా నాన్నను సరదాగా ‘ఏం నాగిరెడ్డి’ అంటూ సరదాగా పిలిచేవాడు.. నాన్న చెస్ బాగా ఆడేవారు. బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్ కూడా బాగా ఆడేవారని తన తల్లిదండ్రులతో తన అనుబంధాన్ని మౌనిక గుర్తు చేసుకుంది. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments