Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిడెడ్‌’ అప్పగింత పూర్తిగా స్వచ్ఛందం... అపోహలు వద్ద‌న్న సీఎం

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (18:35 IST)
ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తిగా స్వచ్ఛందమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. వివిధ కారణాలతో నడుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వం ఒక అవకాశం కల్పిస్తుందని గుర్తు చేశారు. ఇష్టం ఉన్నవారు, స్వచ్ఛందంగా ప్రభుత్వంలో విలీనం చేయొచ్చని, లేదంటే యథాప్రకారం నడుపుకోవచ్చని మరోసారి ప్రస్తావించారు. 
 
 
విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల అమలుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన విద్యా విధానం అమలుకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడ్‌ విద్యాసంస్థలు విలీనం చేస్తే.. వారి పేర్లు అలాగే కొనసాగిస్తామని వెల్లడించారు. ప్రభుత్వంలో విలీనానికి ముందు అంగీకరించిన వారు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. స్వతంత్రంగా నడుపుకుంటామంటే నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చని స్పష్టం చేశారు.
 
 
 విద్యార్థులకు మంచి సదుపాయాలు, నాణ్యమైన విద్య అందాలన్నదే తమ ఉద్దేశమని, ఈ ప్రక్రియలో ఎక్కడా బలవంతం లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో అపోహలకు గురికావొద్దని, రాజకీయాలు కూడా తగవని సీఎం జ‌గ‌న్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments