కర్నాటకలో నిన్న హిజాబ్ వివాదం... నేడు లౌడ్ స్పీకర్ల రచ్చ

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (12:28 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన కర్నాటకలో రోజుకో వివాదం పుట్టుకొస్తుంది. దక్షిణ భారత రాష్ట్రాల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీతో పాలన చేస్తున్న రాష్ట్రం ఇదొక్కటే. ఈ రాష్ట్రంలో ఒక వివాదం ముగిసిపోగానే మరో వివాదం తెరపైకి వస్తుంది. నిన్నమొన్నటి వరకు హిజాబ్ వివాదం దేశాన్ని ఓ కుదుపు కుదిపింది. కర్నాటక రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా లౌడ్ స్పీకర్ల వివాదం తెరపైకి వచ్చింది. ముస్లిం ప్రార్థనాలయాలైన మసీదులపై ఉన్న మైకులను తొలగించాలన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ డిమాండ్‌ను మితవాదులు బలంగా వినిపిస్తున్నారు. విద్యా సంస్థల్లో హిజాబ్ వివాదం సద్దుమణిగేలోపు లౌడ్ స్పీకర్ల అంశం తెరపైకి రావడం గమనార్హం. ఈ అంశాన్ని బీజేపీ అనుబంధ సంస్థలైన భజరంగ్‌దళ్, శ్రీరామ సేనలు తెరపైకి తీసుకొచ్చాయి. 
 
మసీదుల్లో ప్రార్థనను మైకుల ద్వారా ప్రసారం చేయడాన్ని నిలిపి వేయకపోతే అవే సమయాల్లో తాము హిందూ ఆలయాల్లో ఓమ్ నవశ్శివాయ, జై శ్రీరామ్, హనుమాన్ చాలీసా, ఇతర ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రసారం చేస్తామని ఆయా సంస్థలు హెచ్చరించాయి. కాగా, ఈ వాదనకు కర్నాటక మంత్రి ఈశ్వరప్ప కూడా సానుకూలంగా స్పందించడం గమనార్హం. 
 
ఇదే అంశంపై భజరంగ్ దళ్ నేత భరత్ శెట్టి మాట్లాడుతూ, "హనుమాన్ చాలీసాను ప్రసారం చేసేందుకు ఇది పోటీ కాదు. ముస్లింలు ప్రార్థన చేసేందుకు నాకేమీ అభ్యంతరం కాదు. కానీ, అదేసమయంలో మైకుల ద్వారా ఆలయాలు, చర్చిల్లో కూడా చేస్తే అపుడు మతాల మధ్య వివాదానికి దారితీస్తుంది" అని అభిప్రాయపడ్డారు. అందువల్ల మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments