Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె లేచిపోయింది... అతడు సైలెంట్... ఇతడు లబోదిబో...

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (18:25 IST)
సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఇది. ప్రేమించిన ప్రియుడ్ని.. పెళ్ళి చేసుకున్న భర్తను కాదని వేరొకరితో పారిపోయింది ఒక మహిళ. నెల్లూరు జిల్లాలో సంఘటన జరిగింది.
 
నెల్లూరు జిల్లా కొరవకుట్లకు చెందిన 19 యేళ్ళ యువతిని అదే ప్రాంతానికి చెందిన గణేష్ ప్రేమించాడు. తల్లిదండ్రులకు తెలియకుండా ఆ యువతితో ఆరునెలల పాటు సహజీవనం చేశాడు గణేష్. అయితే ఆ విషయం తెలియని యువతి తల్లిదండ్రులు తమ బంధువుల అబ్బాయికి ఇచ్చి నెల రోజులకు ముందు వివాహం చేశారు. వివాహ సమయంలో అడ్డుచెప్పని యువతి రెండురోజులకే అత్తవారింటి నుంచి పారిపోయింది.
 
ఆ తరువాత ప్రియుడి దగ్గరకు వెళ్ళి మరో పెళ్ళి చేసుకుంది. భర్త ఆ విషయాన్ని లైట్‌గా తీసుకొని భార్యను వదిలేశాడు. ప్రియుడిని పెళ్ళి చేసుకున్న యువతి ఐదు రోజుల పాటు అతనితో గడిపింది. అయితే గత కొన్నిరోజులుగా అక్కడ కూడా కనిపించకుండా పోయింది. 
 
అసలేం జరుగుతుందో తెలియక ప్రియుడు గణేష్ పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రియురాలిని అప్పజెప్పాలని పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గణేష్ ఉంటున్న ఇంటి పక్కనే మరో యువకుడితో మహిళ పరిచయం పెట్టుకుని అతనితో వెళ్ళిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments