Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను కాదని ప్రియుడికి దగ్గరైంది, అది నచ్చక చంపేసిన ప్రియుడు

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (17:18 IST)
భర్తతో సాఫీగా సాగిపోతున్న సంసారం. కానీ ఇద్దరి మధ్యా మనస్పర్థలు మొదలయ్యాయి. భర్త డామినేషన్‌ను తట్టుకోలేని ఆ భార్య వేరుగా వచ్చేసింది. తల్లిదండ్రులు లేకపోయినా బంధువుల ఇంట్లో వచ్చి ఉండిపోయింది. ఈ క్రమంలో మరో యువకుడితో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ఆమె మరణానికి కారణమైంది.
 
గుంటూరు జిల్లా ఈపూరు మండలం కూచిపల్లికి చెందిన తేజస్వి దారుణ హత్య కలకలం రేపుతోంది. సంవత్సరం క్రితం ఆమెకు వివాహమైంది. అయితే భర్తతో గొడవల కారణంగా తాతయ్య, నానమ్మల దగ్గర ప్రస్తుతం తేజస్వి ఉంటోంది. రెండు నెలల నుంచి తన ఇంటి పక్కనే ఉన్న దుర్గాప్రసాద్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.
 
ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ ఊర్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. పెళ్ళి చేసుకుంటానని తేజస్వికి హామీ ఇచ్చాడు దుర్గాప్రసాద్. దీంతో శారీరక సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. అయితే వారంరోజుల నుంచి పెళ్ళి చేసుకోవాలన్న ఒత్తిడి తేజస్విని నుంచి ఎక్కువైంది. ఆల్రెడీ నీకు పెళ్లయింది, నిన్నెలా పెళ్లాడుతాను అంటూ ప్రశ్నించేసరికి ఆమె షాకయ్యింది. దాంతో ఆమె మరింత వత్తిడి తెచ్చింది.
 
దీంతో దుర్గాప్రసాద్ ఆమెను ఎలాగైనా చంపేయాలనుకున్నాడు. నిన్న సాయంత్రం ఇంటి ముందు మంచంపై సెల్ ఫోన్లో వీడియోలు చూస్తూ కూర్చున్న తేజస్విపై కత్తితో దాడి చేసి అతి కిరాతకంగా చంపేశాడు దుర్గాప్రసాద్. అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments