Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఆల‌యాల‌కు గ్రామ, వార్డు సచివాలయాలలోనే అడ్వాన్స్ బుకింగ్‌

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (11:51 IST)
ఏపీలో ప్ర‌ధాన ఆల‌యాల‌కు వెళ్లాల‌నుకునే భ‌క్తులకు అక్క‌డ ఉండ‌టానికి కావాల్సిన‌ అద్దె గదులను గ్రామ, వార్డు సచివాలయాలలోనే అడ్వాన్స్ బుకింగ్‌ చేసుకునే వీలును గ‌వ‌ర్న‌మెంట్ కల్పించింది.
 
శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల ఆల‌యాల‌కు సంబంధించిన‌ స్వామి వారి సేవా టికెట్లను కూడా ముందస్తుగా తీసుకోవ‌చ్చు. ఈ సేవలకు సంబంధించిన పూర్తి వివరాలను…గ్రామ‌, వార్డు వాలంటీర్లు తమ పరిధిలోని అన్ని ఫ్యామిలీల‌కు వాట్సాప్‌ మెసేజ్‌ల రూపంలో పంపిస్తున్నారు. 
 
 జూన్‌ 8వ తేదీ నుంచి అన్ని ఆలయాల్లో దర్శనాలు తిరిగి ప్రారంభించ‌డానికి కేంద్ర ప్రభుత్వం ప‌ర్మిష‌న్ ఇచ్చిన‌ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని దేవాల‌యాల‌కు సంబంధించిన అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా, లాక్ డౌన్ రూల్స్ పాటిస్తూ ద‌ర్శ‌నం చేసుకునేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.
 
గ్రామ, వార్డు సచివాలయాలలో మొత్తం 540 రకాల సర్వీసెస్ పొందేందుకు గ‌వ‌ర్న‌మెంట్ తగిన ఏర్పాట్లు చేసింది.  సచివాలయం ద్వారా ఏయే సేవలు పొందవచ్చో రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి వాట్సాప్‌ ద్వారా స‌మాచారం చేర‌వేస్తారు. వాలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాల అందరి ఫోను నంబర్లతో ఒక వాట్సాప్‌ గ్రూపును క్రియేట్ చేస్తారు.
 
గ‌వ‌ర్న‌మెంట్ ప‌థ‌కాలతో పాటు ప్ర‌తి స‌మాచారం ఈ వాట్సాప్‌ గ్రూపుల ద్వారా కూడా అందరికీ తెలియజేస్తారు. ఓటర్‌ ఐడీ అప్లికేషన్, కుటుంబ ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, పట్టాదారు పాస్‌ పుస్తకం, ఎఫ్‌ఎంబీ కాపీ, ఆధార్‌ కేవైసీ, ఎలక్ట్రిక్‌ మీటర్‌ కనెక్షన్, ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్, ఈసీ కాపీ, కొత్త రైస్‌ కార్డు, రైస్‌ కార్డులో కొత్త పేర్ల చేరిక, వివాహ, మరణ ధ్రువీకరణ పత్రాలు, బిల్డింగ్‌ ప్లాన్‌ ఆమోదం, పుట్టిన తేదీ, విద్యార్థి బస్‌పాస్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ల స్లాట్‌ బుకింగ్‌ తదితర మొత్తం సేవల గురించి వాలంటీర్లు విస్తృత ప్రచారం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments