బావ చేతిలో మోసపోయానంటున్న తారా చౌదరి

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (09:51 IST)
తారా చౌదరి... హైటెక్ వ్యభిచార సూత్రధారిణిగా గుర్తింపుపొందింది. నటి కూడా. తెలుగు చిత్రపరిశ్రమతో పాటు తెలుగు రాజకీయాల్లో ఈమె సంచలనంగా మారింది. అనేక మంది ప్రముఖులకు అమ్మాయిలను సరఫరా చేసినట్టు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. అలా కొంతకాలంగా ఇంటికే పరిమితమైన తారా చౌదరి.. ఇపుడు మళ్లీ వార్తల్లోకెక్కారు. బావ వరుసయ్యే ఓ వ్యక్తి తనను దారుణంగా మోసం చేశాడంటూ పోలీసు మెట్లెక్కింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
హైదరాబాద్, జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో తారా చౌదరి (31) ఓ ఫిర్యాదు చేసింది. అందులో తనకు బావ వరుసయ్యే చావ రాజ్‌కుమార్ అనే వ్యక్తి మోసం చేశారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొంది. రాజ్‌కుమార్ సోదరి సుజాత కారణంగా అతనితో మంచి పరిచయం ఏర్పడినట్టు చెప్పుకొచ్చింది. 
 
సోదరుడు రాజ్‌కుమార్‌ను పెళ్లి చేసుకోవాలని తనను సుజాత కోరిందనీ, కానీ తాను మాత్రం అతనికి వివాహమైంది కదా అని ప్రశ్నించగా, లేదు విడాకులు ఇవ్వబోతున్నాడు ఎలాంటి సమస్యా ఉండదని సుజాత నమ్మించిందని తారా చౌదరి తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
అయినప్పటికీ రాజ్‌కుమార్‌ను తాను ఇష్టపడలేదని చెప్పింది. ఆ తర్వాత తాను హైదరాబాద్‌ను వీడి విజయవాడకు వెళ్లగా, అక్కడకు కూడా రాజ్‌కుమార్ వచ్చి తనను పలు రకాలుగా వేధించాడని ఆరోపించింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని నిలదీయగా, అతను తప్పించుకుని తిరుగుతూ తనను వేధిస్తున్నాడని తారా చౌదరి తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments