Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసాని రియలైజ్ అయ్యేందుకు ప్రభుత్వం ఓ ఛాన్స్ ఇవ్వాలి : నటుడు శివాజీ (Video)

ఠాగూర్
సోమవారం, 17 మార్చి 2025 (19:18 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషించిన కేసులో అరెస్ట అయి విచారణ ఖైదీగా జైలులో ఉన్న సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి చేసిన తప్పును తెలుసుకుని రియలైజ్ అయ్యేందుకు ఏపీ ప్రభుత్వం ఒక అవకాశం ఇవ్వాలని సినీ నటుడు శివాజీ విజ్ఞప్తి చేశారు. 
 
తాను నటించిన ఓ సినిమా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాల వరకు ఎవరూ వెళ్లరాదన్నారు. ఒక వేళ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని విమర్శించే క్రమంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయా వ్యక్తుల కుటుంబం జోలికి పోరాదన్నారు. తాను 12 యేళ్ల పాటు రాజకీయ జీవితంలో ఉన్నానని, ఏనాడూ కూడా ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని ఆయన గుర్తు చేశారు. 
 
అదే సరైన పద్దతి అని కూడా శివాజీ తెలిపారు. అలాంటపుడు మనం కూడా సేఫ్ ఉంటామని చెప్పారు. ఇక పోసాని విషయంలో జరిగింది చాలని, ఆయన రియలైజ్ అవ్వడానికి ఒక అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా, పోసానికి కోర్టు ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ విధించిన విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments