Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం పార్టీలోకి మరో 30మంది.. జగన్ పార్టీ ఖాళీ?!: అచ్చెన్నాయుడు

Webdunia
శనివారం, 14 మే 2016 (13:36 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌పై వైకాపాలోని ఎమ్మెల్యేలకు నమ్మకం లేదని.. అందుకే వారంతా పార్టీకి రాజీనామా చేసి.. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. వైకాపాలో ఇంకా వలసలు ఆగిపోలేదని.. మరికొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలోకి రానున్నట్లు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఇందుకోసం తనతో పాటు.. తమ పార్టీకి చెందిన ఇతర నేతలతో వారంతా మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటికీ వచ్చినవారు 17 మంది అయితే మరో 30 మంది త్వరలో తెలుగు దేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. కొత్తగా వచ్చి చేరే వారితో పాటు మొత్తం 47 మంది వైకాపా నుంచి జంప్ అయిన వారవుతారని అచ్చెన్నాయుడు తెలిపారు. తద్వారా ఏపీలోనూ జగన్ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. 
 
మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే లేదని బీజేపీ నేతలు స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించట్లేదని.. అందువల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వచ్చే యేడాది జనవరిలో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' రిలీజ్

ఆయనకు ఇచ్చిన మాట కోసం కడప దర్గాకు రామ్ చరణ్

ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్: భారతదేశ స్వాతంత్ర్య ప్రయాణం పునశ్చరణ

నయనతార, ధనుష్‌ల కాపీరైట్ వివాదం.. 24 గంటల్లో ఆ పనిచేయకపోతే?

దేవకి నందన వాసుదేవ షూట్ అన్నీ ఛాలెంజ్ గా అనిపించాయి : మానస వారణాసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

తర్వాతి కథనం
Show comments