Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపిస్టుతో చుంబనానికి ఒకే చెప్పి.. నాలుకను కొరికిపడేసిన ఫ్రెంచ్ యువతి!

Webdunia
శనివారం, 14 మే 2016 (13:34 IST)
ఇటీవల కాలంలో కామాంధుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. చిన్నాపెద్ద, ముసలి ముతక అనే తేడాకూడా లేకుండా ఆడపిల్ల కనపడితే చాలు.. రెచ్చిపోతున్నారు. కనీసం చచ్చిన తర్వాత కూడా వదలడం లేదు. కామాంధుల బారినపడి కొందరు అబలలు బలైపోతుండగా మరికొందరు మాత్రం తప్పించుకోగలుగుతున్నారు. అయితే ఓ యువతి మాత్రం ఎంతో చాకచక్యంగా ఆలోచించి కామాంధుల బారి నుంచి తప్పించుకుంది. ఈ ఘటన దక్షిణ ఫ్రాన్స్‌ ప్రాంతమైన టౌలైజ్‌లోని పర్పాన్‌లో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. పర్పాన్ ప్రాంతానికి చెందిన 19 యేళ్ళ యువతి ఒంటరిగా ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమెను వేధిస్తూ వెంటబడ్డాడో 24 యేళ్ల కామాంధుడు. దీన్ని గమనించిన ఆ యువతి అతని నుంచి తప్పించుకునేందుకు లిఫ్ట్ ఎక్కింది. అదేసమయంలో ఆ ఆకతాయి కూడా లిఫ్ట్ ఎక్కి తనతో శృంగారం చేయాలని బెదిరించాడు. దీనికి ఆ యువతి అంగీకరించకపోవడంతో ఆమె వేసుకున్న జాకెట్‌ను చించి దుస్తులను లాగి పడేశాడు. 
 
ఈ పరిస్థితి ఎలా బయటపడాలిరా దేవుడా నుకుంటుండగా ఆమె ఒక ఉపాయం ఆలోచించింది. దీంతో యువతి అతనితో అధరచుంబనానికి ఒప్పుకుంది. ఆమె ఓకే చెప్పడంతో సంతోషంతో ముద్దుకు సిద్ధమైన యువకుడి నాలికను యాపిల్ పండు కొరికినట్టు పంటితో పట్టుకుని కొరికిపడేసింది. నాలిక తెగి రక్తం ధారలుగా కారుతున్న యువకుడు భయపడి అక్కడి నుంచి పరుగులు తీశాడు. 
 
అనంతరం యువతి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పింది. అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని రక్తంతో తడిసివున్న యువకుడి నాలిక ముక్కను స్వాధీనం చేసుకుని సమీపంలోని అన్ని ఆస్పత్రులకు సమాచారాన్ని చేరవేశారు. తెగిన నాలుకతో ఎవరన్నా ఆస్పత్రికి వస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని తెలిపారు. 
 
ఈ క్రమంలో ఓ ఆస్పత్రికి వచ్చిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి ఘటనా స్థలంలో దొరికిన నాలుక, రక్తంతో డీఎన్ఏ పరీక్ష నిర్వహించి అతడే నిందితుడని నిర్ధారించి అత్యాచారం నేరంపై అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇక ఆ యువతి చాక చక్యానికి జనం అభినందనలతో ముంచెత్తారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నయనతార, ధనుష్‌ల కాపీరైట్ వివాదం.. 24 గంటల్లో ఆ పనిచేయకపోతే?

దేవకి నందన వాసుదేవ షూట్ అన్నీ ఛాలెంజ్ గా అనిపించాయి : మానస వారణాసి

అలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నా : పరుచూరి గోపాలక్రిష్ణ

నయనతార బర్త్‌డే స్పెషల్.. రాక్కాయిగా లేడీ సూపర్ స్టార్

స్టార్ హీరోల ఫంక్షన్ లకు పోటెత్తిన అభిమానం నిజమేనా? స్పెషల్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

తర్వాతి కథనం
Show comments