Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆజాదీకీ అమృత్ మ‌హోత్స‌వ్ ... శ్రీకాకుళంలో ఫిట్ ఇండియా ర‌న్

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (10:08 IST)
ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో భాగంగా దేశవ్యాప్తంగా జరువుతున్న ఫిట్ ఇండియా రన్ శనివారం ఉదయం శ్రీకాకుళంలో నిర్వ‌హించారు. నెహ్రు యువక కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రన్ ను విశ్రాంత జాయింట్ కలెక్టర్ పి.రజనీ కాంతారావు జెండా ఊపి ప్రారంభించారు.
 
అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాద్ కా అమృత మహోత్సవంలో భాగంగా ఆగస్ట్ 13 న ప్రారంభమైన ఈ రన్ అక్టోబర్ 2 వరకు గాంధీ జయంతి వరకు సాగుతుందని, అన్ని జిల్లాల్లో ఈ రన్ నిర్వహిస్తారని అన్నారు. 
 
దృఢమైన భారత్ స్థాపన ప్రధానమంత్రి లక్ష్యమని, ఈ దిశగా అందరూ అడుగులు వేసి ప్రతి నిత్యం వ్యాయామాలు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని  ఆయన కోరారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అరసవల్లి జంక్షన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు 5 కిలోమీటర్లు ఈ రన్ సాగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా  నెహ్రూ యువక కేంద్రం కో ఆర్డినేటర్ మహేశ్వరరావు, జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి బి.శ్రీనివాస్ కుమార్, పలువురు జిల్లా అధికారులు, ఎన్. సి.సి.విద్యార్థులు, వాకర్స్ వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, ఇండియన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

కృష్ణుడికి భక్తుడికి మధ్య నడిచే కథే డియర్ కృష్ణ : పి.ఎన్. బలరామ్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments