Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెనాలిలో నర్సును కారులో తీసుకెళ్లిన రౌడీ షీటర్, తెల్లారేసరికి ఆమె బ్రెయిన్ డెడ్

ఐవీఆర్
ఆదివారం, 20 అక్టోబరు 2024 (18:28 IST)
తెనాలిలో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సహానా అనే యువతిని రౌడీ షీటర్ నవీన్ శనివారం నాడు తన పుట్టినరోజు వేడుక చేసుకునేందుకు ఆమెను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. అలా తీసుకెళ్లిన కొన్ని గంటలకే అపస్మారక స్థితిలో వున్న నర్సును తీసుకువచ్చి తెనాలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు.
 
ఉదయం డ్యూటీకి వెళ్లిన తమ కుమార్తెకి ఇంతలో ఏమైందోనన్న ఆందోళనతో చేరుకున్న తల్లిదండ్రులకు వైద్యులు షాకింగ్ వార్త చెప్పారు. నర్సు సహానా బ్రెయిన్ డెడ్ అయ్యిందని చెప్పారు. ఆమెకి బ్రెన్ డెడ్ ఎందుకు అయ్యిందో తెలియరాలేదు. దీనితో ఆమెకు మెరుగైన వైద్య సేవల కోసం మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా వైద్యులు యువతి బ్రెయిన్ డెడ్ అయ్యిందని చెప్పడంతో ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. కాగా నవీన్ నడుపుతున్న కారుకి అడ్డుగా మరో వాహనం రావడంతో బ్రేకులు వేయడంతో ముందుసీట్లో కూర్చున్న నర్సు తలకి గాయం అయినట్లు అతడు వెల్లడించినట్లు తెలుస్తోంది
 
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో బాధితురాలు కన్నుమూసింది. దీనితో నవీన్ అనే యువకుడిపై పోలీసు కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు నవీన్ పైన వల్లభాపురంలో రౌడీషీట్ వున్నట్లు కనుగొన్నారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్.." అంటున్న చై - శోభిత

అక్టోబర్ 25న రాబోతోన్న "నరుడి బ్రతుకు నటన".. సక్సెస్ చెయ్యండి ప్లీజ్

"లవ్ రెడ్డి" స్వచ్ఛమైన ప్రేమకథ.. ఎంతటి రాతి గుండెనైనా కరిగించే క్లైమాక్స్

జై హనుమాన్ కోసం హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి

కుటుంబ సమేతంగా చూడదగ్గ వెబ్ సిరీస్.. ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాఫీలో నెయ్యి వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ఖర్జూరం పాలుని పవర్ బూస్టర్ అని ఎందుకు అంటారు?

మహిళలకు సానుకూల దృక్పథం చాలా అవసరం.. ఏం చేయాలి?

జీరా వాటర్ ఎందుకు తాగాలో తెలుసా?

గుండెలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా చేయాల్సినవి ఏమిటి?

తర్వాతి కథనం
Show comments