Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాతో రా అంటూ బాలికను తీస్కెళ్లిన ఉపాధ్యాయుడు... గర్భవతిగా తిరిగొచ్చింది...

Webdunia
బుధవారం, 31 జులై 2019 (16:14 IST)
ఈమధ్య కొంతమంది గురువులు వారి వృత్తికే మచ్చ తెస్తున్నారు. తమ వద్దకు విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు వచ్చే బాలికలపై వల విసిరి వారి జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. ఇలాంటి తిరుపతిలో జరిగింది. కడపలో ఆ బాలిక పదో తరగతి చదివే సమయంలో ఆమెపై కన్నేసిన ఉపాధ్యాయుడు వీరయ్య ఆమెను ఫాలో అవుతూ వచ్చాడు. 
 
బాలిక పదో తరగతి ఉత్తీర్ణురాలై తిరుపతిలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. దీంతో సదరు ఉపాధ్యాయుడు ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్లాన్ వేశాడు. ప్రేమిస్తున్నాననీ, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన ఆ బాలిక ఏమీ తెలియని ఆ వయసులో గత దసరా శెలవులకు ఇంటి నుంచి అతడితో వెళ్లిపోయింది. పోతూపోతూ బంగారం, కొంత నగదు తీసుకుని వెళ్లిపోయింది. డబ్బు, బంగారంతోపాటు తమ కుమార్తె అదృశ్యమవ్వడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు.
 
ఇదిలావుండగా సదరు ఉపాధ్యాయుడు తన వెంట తీసుకెళ్లిన బాలికను తన భార్య అంటూ పరిచయం చేసి సికింద్రాబాద్‌ లోని ఓ ప్రాంతంలో ఓ గదె అద్దెకు తీసుకుని అక్కడే కాపురం చేశారు. ఫలితంగా బాలిక గర్భవతి అయ్యింది. మరోవైపు తమ బిడ్డ ఆచూకి లభించకపోవడంతో ఆమె పేరెంట్స్ జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ వద్ద మొరపెట్టుకున్నారు.

ఆయన కఠిన ఆదేశాలివ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి వీరయ్య-బాలిక ఆచూకి కనుగొని బాలిక స్వగ్రామమైన గిద్దలూరుకి తీసుకుని వచ్చారు. ఆడుతూపాడుతూ చదువుకునే తమ కుమార్తె ఉపాధ్యాయుడి చేతిలో మోసపోయి గర్భవతిగా తమ ముందుకు రావడంతో ఆమె తల్లిదండ్రులు ఆవేదన చెందారు. కాగా వీరయ్యపై పోలీసులు ఫోక్సో చట్టంపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం