Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలిక స్నానం చేస్తుండగా వీడియోలు తీసి...

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (10:38 IST)
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పనపాకంలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలిక స్నానం చేస్తుండగా ఆ దృశ్యాలను చిత్రీకరించి లైంగింక దాడికి పాల్పడ్డారు నలుగురు యువకులు. దీంతో ఆ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 
 
వివరాలు పరిశీలిస్తే పనపాకం గ్రామానికి చెందిన సరిత ( పేరు మార్చాం) చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో సరిత సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ 9వ తరగతి చదువుతోంది. స్కూల్‌కి సెలవులు కావడంతో పనపాకంలో నాయనమ్మ ఇంటికి వచ్చింది. సరిత స్నానం చేస్తుండగా మోహన్ అనే మైనర్ బాలుడు తన సెల్‌ఫోన్‌తో  వీడియో తీసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
 
అంతేకాదు మోహన్ తన నలుగురు స్నేహితులకు ఆమె ఫోటోలను షేర్ చేశాడు. వీటిని చూసిన ఆ యువకులు ఈ బాలికను లైంగికంగా వేధించారు. తమకు సహరించకపోతే ఫేస్ బుక్‌లో పెడతామని బెదిరించారు. వారి వేధింపులు తాళలేక ఆమె ఉరి వేసుకొని చనిపోవాలని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇరుగుపొరుగువారు గమనించి సరైన సమయంలో ఆమెను కాపాడటంతో ప్రాణాలతో బయటపడింది. కాగా ఈ దారుణానికి ఒడిగట్టిన ఐదుగురు యువకులను అరెస్టు చేసిన ఖాకీలు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం