Webdunia - Bharat's app for daily news and videos

Install App

హామీలలో 90 శాతం అమలు: మంత్రి అనిల్

Webdunia
బుధవారం, 22 జులై 2020 (20:50 IST)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమంలో జలవనరుల శాఖ అధికారులు, సిబ్బంది భాగస్వామ్యం కావాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.
 
విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో వనమహోత్సవం  భాగంగా గవర్నర్‌పేట్‌లోని బుధవారం మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 90 శాతం అమలు చేయడం జరిగిందన్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఆయా కాలనిలలో మొక్కల పెంపకం కార్యక్రమాన్ని సీఎం ఈ రోజు స్వీకారం చేశారన్నారు. సీఎం స్పూర్తితో మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని కోరారు. 
 
ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ  ఎమ్మెల్యే పి. రామ కృష్ణారెడ్డి, అధికారులు  సి నారాయణ రెడ్డి, ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఇరిగేషన్), కె.నరసింహమూర్తి, ఇరిగేషన్  సూపరింటెండింగ్ ఇంజనీర్, ఇరిగేషన్ సర్కిల్ విజయవాడ, పిపిఎంయు, సూపరింటెండింగ్ ఇంజనీర్,  ఎ.రాజా స్వరూప్ కుమార్, కెసి డివిజన్, విజెఎ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,  ఎ రాజా స్వరూప్ కుమార్  తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

తర్వాతి కథనం
Show comments