Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రపోతున్న తొమ్మిదేళ్ళ బాలికను ఇంటి మిద్దెపైకి తీసుకెళ్లి 16 యేళ్ల బాలుడు రేప్!

యుక్త వయసులో ఉండే యువకులు... కామంతో కళ్లుమూసుకుని పోయి అబలలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. తాజాగా కడప జిల్లాలో ఓ తొమ్మిదేళ్ళ బాలికపై 16 యేళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివ

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2016 (08:19 IST)
యుక్త వయసులో ఉండే యువకులు... కామంతో కళ్లుమూసుకుని పోయి అబలలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. తాజాగా కడప జిల్లాలో ఓ తొమ్మిదేళ్ళ బాలికపై 16 యేళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
కడప 1వ డివిజన్ పరిధిలో ఎదురెదురుగా ఉండే గృహాల్లో 9 సంవత్సరాల బాలిక, 16 ఏళ్ల బాలుడు కుటుంబాలు నివాసముంటున్నాయి. అయితే, బాలికపై కన్నేసిన బాలుడు.. శనివారం రాత్రి ఇంటి వద్ద పడుకుని నిద్రపోతున్న బాలికను తన ఇంటి మిద్దెపైకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంతలో నిద్రలేచిన బాలిక తల్లి.. కుమార్తె కోసం గాలించింది. ఇది చూసిన బాలుడు.. భయపడి ఇంటినుంచి పారిపోయాడు. 
 
మరుసటి రోజు బాలిక కడుపునొప్పి వస్తుందని చెప్పడంతో అనుమానం వచ్చిన తల్లి ఆరా తీయగా, జరిగిన విషయాన్ని బాలిక వివరించింది. దీనిపై చిన్నచౌకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి వైద్యం కోసం బాలికను రిమ్స్‌కు తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలబాలికల పేర్లను పోలీసులు వెల్లడించలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments