Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరుబయట నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా ఖేడ గ్రామంలో అభం శుభం తెలియని ఓ చిన్నారిపై కామాంధులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు.

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2016 (17:20 IST)
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ అత్యాచారాలకు, దోపిడీలు, దొంగతనాలు, అరాచకాలకు అడ్డాగా మారిపోయింది. ఇప్పటికే రోజుకో వివాదాస్పద వార్తతో ఆ రాష్ట్రం పేరు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాల్లో మార్మోగిపోతోంది. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా ఖేడ గ్రామంలో అభం శుభం తెలియని ఓ చిన్నారిపై కామాంధులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు. 
 
తల్లిదండ్రులతో కలిసి ఆరు బయట నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం అనంతరం స్పృహలేని స్థితిలో ఆమెను వదిలిపెట్టి పరారయ్యారు. శనివారం తెల్లవారుజామున ఈ దారుణం చోటుచేసుకుంది. అర్థరాత్రి 1.30 గంటల ప్రాంతంలో వర్షం రావడంతో తల్లికి మెలకువ వచ్చి చూసేసరికి బాలిక కనిపించలేదు. దాంతో బాలిక కోసం గాలించారు. సమీపంలోని ఓ బావి వద్ద చిన్నారి ఒంటిమీద దుస్తులు లేకుండా స్పృహ కోల్పోయి కనిపించడం చోసూ ఆ తల్లి బోరున విలపించింది. 
 
ఆ తర్వాత పోలీసులకు సమాచారమివ్వగా పోలీసులు అక్కడకు చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో మీరుట్ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్పీ అలంకృత సింగ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments