Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో మరో 8 అనుమానిత కరోనా కేసులు - ఎయిర్‌పోర్టుల్లో తప్పనిసరి తనిఖీలు

Webdunia
మంగళవారం, 3 మార్చి 2020 (15:06 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఓ కరోనా వైరస్ వెలుగు చూసింది. దుబాయ్ నుంచి వచ్చిన ఈ ఓ సాఫ్ట్‌వేర్ టెక్కీకి ఈ వైరస్ సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. దీంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా, ఎనిమిది మంది కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో చేరారు. వీరంతా ఇటీవలే ఇటలీ, ఇండొనేషియా, ఇజ్రాయెల్, జపాన్‌ నుంచి వచ్చారు. కరోనా లక్షణాలు కనపడడంతో ఆసుపత్రిలో చేరారు. వీరి రక్త నమూనాలను సేకరించి పూణేకు పంపించారు. మరోవైపు, ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వైరస్ బారిన పడి దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
అమెరికాను కలవరపెడుతున్న కరోనా 
ఇదిలావుంటే, అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఈ వైరస్ బారిన పడి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. మృతులందరూ వాషింగ్టన్ రాష్ట్రానికి చెందినవారు కావడం గమనార్హం. 
 
అమెరికా వ్యాప్తంగా మొత్తం 91 మందికి ఈ మహమ్మారి సోకింది. ఈ వివరాలను అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వెల్లడించారు. వీరిలో 48 మంది విదేశాల నుంచి తిరిగొచ్చారని... మిగిలిన వారికి అమెరికాలోనే వైరస్ సోకిందని ఆయన వివరించారు. 
 
అలాగే, కరోనా వైరస్‌ చికిత్సపై స్పందిస్తూ, వేసవి లేదా వర్షాకాలం ఆరంభం నాటికి కరోనా వైరస్‌కు చికిత్స అందుబాటులోకి వస్తుందన్నారు. అమెరికాలో వేసవి జూన్‌లో ప్రారంభమవుతుందన్నారు. 
 
ఇప్పటికే పలు రకాల ఔషధాలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారని వెల్లడించారు. వ్యాక్సిన్ కోసం మాత్రం ఈ యేడాది చివరి వరకు వేచి చూడాల్సిందేనని చెప్పారు. గత శనివారం కరోనా వైరస్‌కు సంబంధించి తొలి మరణం సంభవించింది.
 
భారత్ ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్ సెంటర్లు 
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దేశంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కరోనా స్క్రీనింగ్‌ కేంద్రాల ఏర్పాటు తప్పనిసరి చేయాలని కేంద్ర హోంశాఖ సూచించింది. 
 
ముఖ్యంగా, చైనా, సింగపూర్, మలేషియా, ఇండొనేషియాతో పాటు పలు దేశాల నుంచి వచ్చే వారిని తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ప్రయాణికుల పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించింది. కరోనాపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ బాహుబలితో అనుపమ్ ఖేర్ - తన 544వ చిత్రమంటూ...

జర్నలిస్టుపై దాడి కేసు- మోహన్ బాబుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

బాహుబలితో నా 544వ చిత్రాన్ని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది : అనుపమ్ ఖేర్

పెళ్లి వయస్సు వచ్చింది, దెయ్యంకంటే మనుషులంటే భయం : విశ్వక్ సేన్

Kamal Hassan: మెగాస్టార్ చిరంజీవి కాదు.. రాజ్యసభకు కమల్ హాసన్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments