శ్రీశైలానికి భారీ వరద ... 7 గేట్ల ఎత్తివేత

శ్రీశైలం జలాశయానికి వరదతాకిడి అధికమైంది. ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుకు వచ్చే వరద నీరు ఎక్కువైంది. దీంతో సోమవారం ఒక్కరోజే ఐదు గేట్లను ఎత్తారు. సాయంత్రం వరకు రెండు గేట్ల

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (09:23 IST)
శ్రీశైలం జలాశయానికి వరదతాకిడి అధికమైంది. ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుకు వచ్చే వరద నీరు ఎక్కువైంది. దీంతో సోమవారం ఒక్కరోజే ఐదు గేట్లను ఎత్తారు. సాయంత్రం వరకు రెండు గేట్ల ద్వారా నీరు విడుదల చేశారు. 6 గంటలకు ఒక గేటు, 7.30 గంటలకు ఒక గేటు, 8 గంటలకు ఇంకో గేటు ఎత్తారు. 10 గంటలకు ఒకటి, 11 గంటలకు ఇంకొకటి ఎత్తారు. 
 
ఎగువ ప్రరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో జూరాల నుంచి 2.76 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. దీంతో శ్రీశైలం నుంచి సాగర్‌కు ఏడుగేట్లు ఎత్తి 2.76 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మంగళవారం కూడా వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో మరో రెండు గేట్లను ఎత్తనున్నారు. తొమ్మిదిగేట్ల ద్వారా నీటిని వదలనున్నారు. 
 
ఇకపోతే.. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 555 అడుగులకు పైగా నీటిమట్టం చేరుకుంది. 222 టీఎంసీల మేరకు నీటి నిల్వ చేరగా, ప్రాజెక్టు గేట్లను కృష్ణమ్మ తాకింది. మరోవైపు ఆల్మట్టికి 75 వేలు, జూరాలకు 1.19 లక్షలు, నారాయణపూర్ కు 99 వేల క్యూసెక్కుల వరద వస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments