అమెరికాలో దారుణం: కారులో మంటలు.. సజీవదహనమైన భారత సంతతి మహిళ

అమెరికాలో భారత సంతతి యువతి మంటల్లో దుర్మరణం పాలైంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు మంటల్లో యువతి ప్రాణాల కోసం ఆర్తనాదాలు పెడుతున్నా.. అందరూ చూస్తుండిపోయారే కానీ.. ఆ

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (09:12 IST)
అమెరికాలో భారత సంతతి యువతి మంటల్లో దుర్మరణం పాలైంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు మంటల్లో యువతి ప్రాణాల కోసం ఆర్తనాదాలు పెడుతున్నా.. అందరూ చూస్తుండిపోయారే కానీ.. ఆ యువతిని రక్షించే ప్రయత్నం మాత్రం చేయలేదు.

వివరాల్లోకి వెళితే.. సయీద్‌ అహ్మద్‌ (23) అనే వ్యక్తి హర్లీన్‌ గ్రెవాల్‌ అనే భారతీయ సంతతికి చెందిన 25ఏళ్ల యువతిని కారులో ఎక్కించుకున్నాడు. ఆమె ప్యాసింజర్‌ సీట్లో కూర్చొని ఉంది. అప్పటికే కొంచెం మద్యం సేవించిన అతడు బ్రూక్లిన్‌-క్వీన్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలో ఓ కాంక్రీట్‌ పిల్లర్‌కు ఢీకొట్టాడు. దీంతో కారులో మంటలు చెలరేగాయి. 
 
అయితే, కారు దిగిన సయీద్‌ వెనుకాలే ఉన్న ప్యాసింజర్‌ అయిన హర్లీన్‌ను పట్టించుకోకుండానే మరో కారులో ఆస్పత్రి వెళ్లిపోయాడు. దీంతో ఆర్తనాదాలు చేస్తూ నడిరోడ్డులో నిస్సహాయ స్థితిలో ఆమె సజీవ దహనమైంది.

అయితే కారు డ్రైవర్ సయీద్ సోదరుడు మాత్రం యువతిని కాపాడేందుకు ప్రయత్నించాడని.. కానీ కారు డోర్ ఇరుక్కుపోయి మహిళ కారు నుంచి బయటకు రాలేకపోయిందన్నారు. అందుకే సయీద్ చేతులు కూడా కాలిపోయాయని చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments