Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో ఘోరం: వృద్ధురాలిపై అత్యాచారం.. నిందితుడిని సజీవదహనం చేశారు..

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (21:46 IST)
చిత్తూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు.. ఓ కామాంధుడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో పుంగనూరు మండలం అప్పిగానిపల్లిలో దారుణం జరిగింది. 60 ఏళ్ల వృద్ధురాలిపై గురుమూర్తి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. 
 
గురుమూర్తి తాగుడుకు అలవాటు పడి జూలాయిగా తిరిగేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ రోజు వృద్ధురాలి వద్ద దగ్గర ఉన్న సొమ్మును తీసుకునేందుకు గురుమూర్తి ప్రయత్నించాడని, అయితే వృద్ధురాలు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం ఆమె వద్ద రూ.4 వేలు అపహరించాడు. 
 
అంతేకాదు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో ఆగ్రహానికి గురయ్యారు. గురుమూర్తిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అంతటితో వారి కోపం చల్లారలేదు. పెట్రోలు పోసి గురుమూర్తిని సజీవదహనం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments