Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 శాతం విద్యార్థులు హాజరు: విద్యాశాఖ మంత్రి డాక్టర్ సురేష్

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (05:58 IST)
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రశాంత వాతావరణంలో తరగతులు జరుగుతున్నాయని, కోవిడ్ తరువాత విద్యావ్యవస్థ గాడిన పడుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రస్తుతం సగటున 50 శాతం విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నారు.

ఈనెల 2 నుంచి ఇప్పటివరకు 9, 10 తరగతులు మాత్రమే పాఠశాలల్లో భోదన జరిగింది. సోమవారం నుంచి 8వ తరగతి విద్యార్థులు కూడా పాఠశాలలకు హాజరవుతున్నారు. మంగళవారం విద్యార్థుల హాజరుకు సంభందించిన వివరాలను  విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
 
"మంగళవారం 50 శాతం 10వ తరగతి విద్యార్థులు హాజరయ్యారు. 9వ తరగతి విద్యార్థులు 52 శాతం హాజరయ్యారు. 8వ తరగతి విద్యార్థులు 47 శాతం హాజరయ్యారు. పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నాం.

ప్రశాంత వాతావరణంలో తరగతులు జరుగుతున్నాయి. మరోవైపు జగనన్న విద్యాకానుక వారోత్సవాలు కూడా జరుగుతున్నాయి. డిసెంబర్ 14 తరువాత 6, 7 తరగతులు కూడా నిర్వహించడం జరుగుతుంది. 
 
కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలల్లో, కళాశాలల్లో  విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు.  ప్రతిరోజూ కోవిడ్ పై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించటం, శానిటైజేషన్, మాస్క్ లు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్ని జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నాం.

పాఠశాలల్లో పారిశుధ్య పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. మాస్క్, శానిటైజేషన్, సామజిక దూరం విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం" అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments