Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు జిల్లాలో 41 నామినేషన్లు దాఖలు

సెల్వి
బుధవారం, 24 ఏప్రియల్ 2024 (12:35 IST)
నెల్లూరు జిల్లాలో మంగళవారం నాటికి 41 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు 36, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గానికి ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు వేసిన వారిలో నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఆయన సతీమణి సునందారెడ్డి, నెల్లూరు నగర నియోజకవర్గానికి సీపీఎం అభ్యర్థి మూలం రమేష్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. 
 
నెల్లూరు రూరల్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డి తరఫున నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ నెల్లూరు నగర అభ్యర్థి పొంగూరు నారాయణ భార్య పొంగూరు రమాదేవి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. 
 
ఆదాల ప్రభాకర రెడ్డి, పొంగూరు నారాయణ ఇద్దరూ తమ తమ నియోజకవర్గాల్లో సోమవారం నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్నికలకు మరో 20 రోజుల సమయం ఉండడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments