నిశ్చితార్థం కోసం అరటి గెలలు కోయబోతే విద్యుత్ షాక్... నలుగురు దుర్మరణం..

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (17:31 IST)
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించారు. నిశ్చితార్థం వేడుక కోసం ఆరటి గెలలు తేవడానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. మండలంలోని పాతరౌతుపేటకు చెందిన కొమ్మ వెంకన్న (49) తన కుమారుడు శ్రీనుకు ఈ నెల 6వ తేదీన నిశ్చితార్థం చేయాలని నిర్ణయించాడు. 
 
ఇందుకోసం అరటి గెలలు తేవడానికి ఆదివారం ఉదయం కొత్తరౌతుపేటలో ఉంటున్న తన బావమరిది ఆబోతుల రాములు (57)కు చెందిన అరటితోటకు బావ, బావమరిదిలు ఇద్దరూ కలిసి వెళ్లారు. అక్కడ చెట్లకు హెచ్‌టీ విద్యుత్‌ తీగలు తగులుతున్నాయని గమనించని వెంకన్న, రాములు గెలలను కోయబోయారు. 
 
విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయారు. ఉదయం వెళ్లిన మనుషులు ఎంతకూ రాకపోవడంతో ఆందోళన చెందిన రాములు భార్య పుణ్యవతి (53), వెంకన్నకు సోదరి వరుస అయ్యే రౌతు బంగారమ్మ (52) తోటకు వెళ్లారు. విగత జీవులుగా పడి ఉన్నవారిని పట్టుకోవడంతో వారికి కూడా విద్యుత్ షాక్ తగిలి మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments