Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూపురం .. డ్రైవర్ కేర్‌లెస్.. వరదలోనే బస్సును పోనిచ్చాడు.. 30 మంది..?

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (14:15 IST)
అనంతలో పెను ప్రమాదం తప్పింది.  భారీ వర్షాల కారణంగా ఏపీలో వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా హిందూపురం  వద్ద వరద నీటిలో చిక్కుకొన్న ఆర్టీసీ బస్సులో నుండి 30 మంది ప్రయాణీకులను స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సోమవారం నాడు ఉదయం అనంతపురం జిల్లాలోని హిందూపురం కొట్నూరు చెరువు లో లెవల్ వంతెన వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. లోలెవల్ వంతెన నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తున్నా.. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అంతేగాకుండా బస్సును ముందుకు తీసుకుపోయాడు.
 
దీంతో వరదలో బస్సు చిక్కుకుపోయింది. అంతేకాదు వరద ఉధృతికి బస్సు కుడివైపునకు తిరగి రోడ్డుకు పక్కనే ఉన్న రెయిలింగ్ ను ఢీకొని నిలిచిపోయింది. ఈ సమయంలో లో లెవల్ వద్ద వరద ఉధృతి పెరిగింది. ఈ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణీకులున్నారు వరద ప్రవాహం పెరుగుతున్న విషఁయాన్ని గమనించిన స్థానికులు బస్సులోని ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
 
మర వైపు కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కమలాపురానికి సమీపంలోని పాపాగ్ని నదిపై ఉన్న బ్రిడ్జి కుప్పకూలింది. దీంతో వాహన రాకపోకలను నిలిపివేశారు. కడప జిల్లా నుండి తాడిపత్రికి ఈ వంతెన గుండానే వాహనాలు వెళ్తాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలను సాగించాలని అధికారులు వాహనదారులకు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments