Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవంతో నడిరోడ్డుపై బైఠాయించిన గ్రామస్థులు.. హైవేపై ట్రాఫిక్ జామ్

Webdunia
సోమవారం, 19 జులై 2021 (16:10 IST)
తెలంగాణలోని యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్ వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. ఓ గ్రామానికి చెందిన ప్రజలు శవంతో నడి రోడ్డుపై బైఠాయించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వీరి ఆందోళన కారణంగా దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించి పోయింది. 
 
దండు మల్కాపూర్ గ్రామానికి చెందిన యాదమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు కరోనా టీకా వేయించుకోవడానికి వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన పట్ల తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్థులు రహదారిపై ఆందోళనకు దిగారు.
 
మృతదేహాన్ని రోడ్డుపైనే ఉంచి రాస్తారోకో నిర్వహించారు. అండర్ పాస్ బ్రిడ్జి లేని కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు మండిపడ్డారు. ఈ ఆందోళన నేపథ్యంలో ఇరువైపులా దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. 
 
ప్రమాద స్థలి వద్దకు వచ్చిన ఏసీపీ శంకర్ ఆందోళనకారులతో మాట్లాడారు. అనంతరం గ్రామస్థులు ఆందోళనను విరమించారు. ఆ తర్వాత నెమ్మదిగా వాహనాలు కదిలాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments