Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 గంటల్లోనే 2.4 లక్షల లడ్డూల విక్రయం.. రాష్ట్రవ్యాప్తంగా విక్రయానికి అనుమతి

Webdunia
సోమవారం, 25 మే 2020 (20:02 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని రాష్ట్రవ్యాప్తంగా తితిదే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రోజు కేవలం 3 గంటల్లోనే 2.4 లక్షల లడ్డూల విక్రయం జరిగింది.

గుంటూరు మినహా 12 జిల్లాల్లో లడ్డూ ప్రసాదాలను తితిదే అందుబాటులోకి తీసుకొచ్చింది. గుంటూరులోని తితిదే కల్యాణమండపం రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్నందున లడ్డూల విక్రయానికి పోలీసులు అనుమతివ్వలేదు.

దీంతో లడ్డూ ప్రసాదం కోసం ఆశగా వచ్చిన భక్తులు వెనుదిరగాల్సి వచ్చింది. మరోవైపు, ఈ నెల 30 నుంచి గుంటూరులో లడ్డూ ప్రసాదాలు విక్రయించనున్నారు.

రేపు మరో 2లక్షల లడ్డూలను జిల్లా కేంద్రాలకు తరలించనున్నారు. లడ్డూలు విక్రయించాలని తమిళనాడు, తెలంగాణ భక్తుల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి.

దీంతో ప్రతి రోజు తమిళనాడుకు లక్ష, తెలంగాణకు 50వేల చొప్పున లడ్డూలు తరలించేందుకు తితిదే యోచిస్తోంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments