Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి.. డెంగ్యూ జ్వరంతో మృతి

Webdunia
శనివారం, 2 నవంబరు 2019 (11:34 IST)
డెంగ్యూ జ్వరంతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. చిత్తూరు జిల్లాలో ఈ విషాధం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని నరసింహాపురం పంచాయతీ టీవీఎన్‌ఆర్‌పురంకి చెందిన కృష్ణం రాజు, రెడ్డమ్మల కుమార్తె చంద్రకళ (18)కు ఇటీవలే పెళ్లి కుదిరింది.  అక్టోబర్ 30న పెళ్లి చేసేందుకు వధువు, వరుడు తరుపు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. 
 
అయితే చంద్రకళకు డెంగ్యూ సోకడంతో తమిళనాడులోని షోళింగర్‌ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. పెళ్లిరోజు వరకు ఆమె కోలుకోకపోవడంతో పెళ్లిని కూడా వాయిదా వేశారు. బుధవారం వధువు, వరుడి తరపు వారు ఆస్పత్రికి చేరుకుని.. తొలుత వివాహం జరిపించాలని పట్టుబట్టారు. 
 
కానీ వైద్యులు అందుకు నిరాకరించడంతో ఆస్పత్రి నుంచి వెనుదిరిగారు. శుక్రవారం రాత్రి చంద్రకళ మృతి చెందడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. చంద్రకళ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments