ఏపీ పోలీస్ లోకి ఒకేసారి 15 వేల మంది చేరిక‌

Webdunia
బుధవారం, 14 జులై 2021 (09:22 IST)
ఏపీ పోలీస్ లోకి ఒకేసారి 15 వేల మంది వ‌చ్చి చేరారు. వారంతా ఎవ‌రో కాదు... గ్రామాల్లోని స‌చివాల‌యాల్లో ప‌నిచేస్తున్న మ‌హిళా సంర‌క్ష‌ణ కార్య‌ద‌ర్శులు. ఏపీలో వీరంతా పోలీసులే అని సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డంతో ఇది సాధ్య‌మైంది. 
 
ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రత, రక్షణకు పెద్దపీట వేస్తూ, అనుక్షణం వారికి తోడు నీడగా అన్నివేళలా అందుబాటులో ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గ్రామ, వార్డు సచివాలయల్లోని 15,000 మంది  మహిళ సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా గుర్తించారు. దీనికి సంబంధించిన జీవో నెంబర్ 59ని కూడా జారీ చేశారు. దీనితో హర్షం వ్యక్తం చేస్తూ మహిళా పోలీసులు ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
 
మ‌హిళా సంర‌క్ష‌ణ కార్య‌ద‌ర్శులు పోలీసు శాఖ‌లో అంత‌ర్భాగం అని డీజీపీ స‌వాంగ్ పేర్కొన్నారు. ఈ సంధర్భంగా మహిళా పోలీసులు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో తాము పోలీసు శాఖలో అంతర్భాగంగా  రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పోలీస్ శాఖ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ సర్వీసెస్ డి.ఐ.జి పాలరాజు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్ నిడిమోరు

Kandula Durgesh: ఏపీలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ, త్వరలో నంది అవార్లులు : కందుల దుర్గేష్

Ram Achanta : అఖండ 2 నిర్మించడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాం : రామ్, గోపీచంద్ ఆచంట

Bhumika Chawla: యూత్ డ్రగ్స్ మహమ్మారి బ్యాక్ డ్రాప్ తో యుఫోరియా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments