Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి వాలంటీర్ రాజీనామా చేసి వైకాపా జెండా కప్పుకుని ప్రచారం చేయాలి : వైకాపా అభ్యర్థి దువ్వాడ

ఠాగూర్
గురువారం, 2 మే 2024 (13:22 IST)
శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ వాలంటీర్లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి వాలంటీర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైకాపా జెండా కప్పుకుని వైకాపా అభ్యర్థుల తరపున ప్రచారం చేయాలని కోరారు. ఇపుడు రాజీనామాలు చేసిన వారినే జూన్ నాలుగో తేదీన మళ్లీ విధుల్లోకి తీసుకుంటామన్నారు. ప్రతి వాలంటీర్ రాజీనామా చేసి వైకాపా కండువా కప్పుకుని ప్రచారం చేయాలని ఆయన కోరారు. 
 
తమ మాట వినని వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తామంటూ హెచ్చరికలు చేశారు. టెక్కలిలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దువ్వాడ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాలంటీర్లంతా విధులకు దూరంగా ఉంటున్నారు. వీరిలో కొందరు వైకాపా నేతల ఒత్తిడికి తలొగ్గి తమ పదవులకు రాజీనామాలు చేశారు. మరికొందరు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారికి దువ్వాడ శ్రీనివాస్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయిన బాబీ డియోల్ : దర్శకుడు జ్యోతి కృష్ణ

Naresh: అల్లరి నరేష్ కథానాయకుడిగా ఆల్కహాల్ టైటిల్ ఖరారు

శ్రీహరి కొడుకు ధనుష్ హీరోగా థాంక్యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్ చేసిన వినాయక్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments