Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్నాడు జిల్లా రెంటాలలో టీడీపీ ఏజెంట్లపై దాడి... ఈసీ సీరియస్

ఠాగూర్
సోమవారం, 13 మే 2024 (07:47 IST)
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఏజెంట్లపై వైకాపా వర్గీయులు భౌతికదాడులకు తెగబడ్డారు. సోమవారం ఉదయం 7 గంటలకే ఏపీలో పోలింగ్ ప్రారంభమైన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం ఆరు గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఉదయం ఏడు గంటల నుంచి అధికారులు ఓటింగ్ ప్రక్రియను ప్రారభించారు. 
 
ఈ పరిస్థితుల్లో పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలలో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన ఏజెంట్లపై అధికార వైకాపా వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారి స్థానంలో మరో ఇద్దరు ఏజెంట్లను అధికారులు అనుమతించారు. మాక్‌ పోలింగ్‌ పూర్తయిన తర్వాత.. రెగ్యులర్‌ పోలింగ్‌ ప్రారంభిస్తున్న క్రమంలో వైకాపా ఏజెంట్లు తెదేపా ఏజెంట్లపై దాడి చేశారు. 
 
మరోవైపు, ఈ దాడి ఘటనపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్‌ ప్రారంభానికి ముందే పల్నాడులో గొడవలపై కన్నెర్రజేసింది. తక్షణం పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. అవసరమైతే అదనపు బలగాలను తరలించి సమస్యాత్మక ప్రాంతాల్లో మొహరించేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

Deverakonda: కంటెంట్ మూవీస్ చేస్తూ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తా - విజయ్ దేవరకొండ

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments