Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ వెస్ట్, అలసిపోయానన్న పోతిన మహేష్: సుజనా చౌదరి విజయం ఖాయమైనట్టేనా?

ఐవీఆర్
శనివారం, 30 మార్చి 2024 (18:11 IST)
విజయవాడ వెస్ట్. ఈ నియోజకవర్గం పొత్తులో భాగంగా భాజపాకి వెళ్లిపోయింది. ఇక్కడ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా గతంలో తెలుగుదేశం నాయకుడు, ప్రస్తుతం భాజపా సీనియర్ నాయకుడు అయిన సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో 40 వేల మంది ముస్లం ఓటర్లు వుంటారని అంచనా. దీనికి రెట్టింపు సంఖ్యలో ఇతర సామాజిక వర్గాల ఓట్లు వుంటాయి.
 
కనుక ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న సుజనా చౌదరి భాజపా నాయకుడు కనుక ఓట్లు సామాజికవర్గంవారీగా కాకుండా మతపరంగా పోలవుతాయని రాజకీయ నాయకుల విశ్లేషణ. ఆ ప్రకారంగా చూస్తే సుజనా చౌదరి విజయం సునాయాసంగా వుండే అవకాశం వుంది. అభ్యర్థుల పరంగా చూసినా వైసిపి నుంచి పోటీ చేస్తున్న షేక్ అసిఫ్ పెద్దగా పాపులర్ నాయకుడు కాదు. సుజనా చౌదరి సీనియర్ నాయకుడిగా ఏపీలో గుర్తింపు వున్నది. పైగా కేంద్రంలో నరేంద్ర మోదీకి ప్రజల నుంచి అధిక మద్దతు వున్న నేపధ్యంలో ఓటింగ్ కూడా ఆ దిశగానే సాగుతుందన్న అభిప్రాయాలు వున్నాయి.
 
కాగా విజయవాడ పశ్చిమ స్థానం కోసం జనసేన పార్టీ నుంచి పోతిన మహేష్ గట్టిగా ప్రయత్నం చేసారు. ఆయన అందుకోసం దీక్షకి కూడా దిగారు. కానీ పొత్తులో భాగంగా భాజపాకి వెళ్లిపోయింది కనుక తను ఏమీ చేయలేనని పవన్ చేతులెత్తేశారు. దీనితో పోతిన పోరాడి అలసిపోయారు. మరి అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం భాజపా అభ్యర్థి సుజనా చౌదరికి పోతిన మహేష్ మద్దతు ప్రకటించి ఆయన గెలుపు కోసం పనిచేస్తారా లేదంటే రెబల్ నాయకుడిగా వుంటారా అన్నది చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments