Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మల్లారా.. అక్కల్లారా.. వెళ్లొద్దు.. భోజనాలు కూడా ఉన్నాయ్... విజయసాయికి ఘోర అవమానం!!

Advertiesment
vijayasaireddy

వరుణ్

, శుక్రవారం, 29 మార్చి 2024 (11:46 IST)
వైకాపా ప్రధానకార్యదర్శి, నెల్లూరు వైకాపా లోక్‌సభ అభ్యర్థి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఘోర అవమానం జరిగింది. నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరుతూ ఆయన ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ ప్రచారంలో ఆయనకు ఘోర అవమానం జరిగింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురంలో ప్రచార రథంపై ఆయన స్థానిక వైకాపా నేతలతో కలిసి ప్రచారం చేపట్టారు. ఆ తర్వాత ఆయన మాట్లాడేందుకు మైక్ అందుకున్నారు. ఆ వెంటనే కార్యకర్తలు, మహిళలు ఇంటిముఖం పట్టారు. దీంతో ప్రజారథంపై ఉన్న నాయకులు మహిళలను వెళ్ళొద్దంటూ, పెద్దాయన విజయసాయిరెడ్డి ప్రసంగించే వరకు ఆగాలని వేడుకున్నారు. భోజనాలు కూడా ఉన్నాయని, తినేసి వెళ్లాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
మహిళలందరూ ఆగాలని, అందరికీ భోజనాలు ఉన్నాయని, పెద్దాయన మాట్లాడతారని ప్రచారరథంపై ఉన్న నేత మైకులోప్రకటించినా జనం ఏమాత్రం పట్టించుకోలేదు... సరికదా... వెనక్కి కూడా తిరిగి చూడలేదు. చెప్పేది వినండి... వెనక్కి రండి.. ఇటు చూడండి. వెళ్లిపోయేవాళ్ళంతా మాకు కనిపిస్తున్నారు. మీరు పోవద్దు.. అంటూ మైకులో పదేపదే చెపుతున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో బీజేపీకి మరో అసెంబ్లీ సీటు వస్తుంది : బీజేపీ స్టేట్ చీఫ్ పురంధేశ్వరి